militia members
-
మిలిషియా సభ్యుల లొంగుబాటు
ఏటూరునాగారం: మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పొడియం లక్క(20), సోడి లక్ష్మి(18) అనే ఇద్దరు మిలిషియా సభ్యులు ఈ రోజు ఏటూరునాగారం ఏఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. -
ముగ్గురు మిలీషియా సభ్యులు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం(నుగూరు)మండల పరిధిలోని సూరావిడు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని మిలీషియా సభ్యులు మాడివి ఇడమ, రౌతు హనుమయ్య, కర్సుం నేగష్గా గుర్తించారు. వీరిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఏఎస్పీ రాహుల్ బుధవారం విలేకరులకు తెలిపారు. -
ఇద్దరు మిలీషియా సభ్యులు అరెస్ట్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసారంపాడు గ్రామానికి చెందిన మడకం మందయ్య, దుర్గ బండి ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జంగాలపల్లిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఇద్దరు మిలీసియా సభ్యులను గుర్తించిర వారిని అరెస్ట్ చేశారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నక్సల్స్‌కు ఆయుధాల సరఫరా: ఇద్దరి అరెస్టు
పాడేరు: అక్రమ మార్గంలో మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఇద్దిరిని విశాఖ జిల్లా పాడేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంచంగిపుట్టు ఏజెన్సీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో ఒకరు తప్పించుకోగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరూ గంజాయి స్మగ్లర్లని, మావోయిస్టులకు ఆయుధాలు కూడా సరఫర చేసేవారని పోలీసులు చెప్పారు. వారి నుంచి ఒక దేశవాళీ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. -
అటవీ ప్రాంతంలో నలుగురు మిలిషియా సభ్యులు అరెస్ట్
ఖమ్మం(చర్ల): చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులతో పాటు ఒక దళ సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెన్నాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసుల్ని చూసి పారిపోతుండగా వీరిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిని విచారించగా తాము మిలిషియా సభ్యులమని ఒప్పుకున్నారు. పట్టుబడిన వారు: చెన్నాపురం గ్రామానికి చెందిన మరకం గంగ, మడివి మూడ, బక్కచింతలపాడు గ్రామానికి చెందిన బాడిక ఉంగయ్య, మడివి ఇలమయ్య లుగా నిర్ధారించగా..దళ మెంబర్ గోరుకొండ గ్రామానికి చెందిన మడవి రాములయ్యగా గుర్తించారు .