మిలిషియా సభ్యుల లొంగుబాటు
Published Tue, Aug 29 2017 1:44 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
ఏటూరునాగారం: మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పొడియం లక్క(20), సోడి లక్ష్మి(18) అనే ఇద్దరు మిలిషియా సభ్యులు ఈ రోజు ఏటూరునాగారం ఏఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఛత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Advertisement
Advertisement