millions of jobs
-
Nandan Nilekani: ఎఎ నెట్‌వర్క్‌తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్‌వర్క్‌తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణలభ్యత సులభతరమవుతుందని ఐటీ సంస్థ ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు. దీనితో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ’జీఎస్వీ + ఎమెరిటస్ ఇండియా సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. వ్యక్తులు .. ఒక ఆర్థిక సంస్థ దగ్గరున్న తమ వివరాలను వేరే సంస్థలతో సురక్షితంగా పంచుకునేందుకు ఎఎ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది. (ఇదీ చదవండి: లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.37,260 కోట్లు కావాలంట!) -
ఐటీలో 13.7 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్
హైదరాబాద్: ఐటీ రంగంలో 13.7 ల క్షల ఉద్యోగాలు ప్రత్యక్షం గాను, 10.5 లక్షల ఉద్యోగాలు పరోక్షంగానూ లభించనున్నాయని ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మాదాపూర్ ఆవాస హోటల్లో మంగళవారం అమెరికన్ ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, రానున్న కాలంలో నగరంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. విద్యార్థులు విదేశీ చదువులు అభ్యసించేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం 74 శాతం ఐటీ ఎగుమతులు చేస్తున్నామన్నారు. నగరంలో పెట్టుబడుల కోసం అమెరికా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. కార్యక్రమంలో అమెరికన్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ మీనన్, పలువురు ఐటీ కంపెనీల ప్రముఖులు పాల్గొన్నారు. -
ఉపాధే లక్ష్యం
రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు పథకాలు : సీఎం వ్యవసాయ కళాశాలల్లో రైతుల పిల్లలకు రిజర్వేషన్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరో 150 ఐటీఐలు మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలను రూపొందించనుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇక్కడ నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ కళాశాలలో రైతుల పిల్లల కోసం 40 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నామని వెల్లడించారు. యువత వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలను చేపట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఉద్యోగ మేళాలకు తండోప తండాలుగా వస్తున్న వారిని చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. ఆది, సోమవారాల్లో ఇక్కడ నిర్వహించిన ఉద్యోగ మేళాలో 50 వేల మందికి పైగా నిరుద్యోగులు వచ్చారని, 220కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఎంపికైన వారంతా క్రమశిక్షణాయుతంగా ఉద్యోగాలు చేసుకోవాలని, తమకు ఉద్యోగాలిచ్చిన కంపెనీల పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఉద్బోధించారు. పరిశ్రమలను స్థాపించడానికి ముందు ఆయా పారిశ్రామికవేత్తలు ప్రకటించిన విధంగా స్థానికులకు విధిగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని కంపెనీలు స్వల్ప విషయాలకు ఉద్యోగాల నుంచి తొలగించే పనులు మానుకోవాలని హితవు పలికారు. కొందరు కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండడం లేదంటూ, ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సభలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి 150 ఐటీఐలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.