ఐటీలో 13.7 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్
హైదరాబాద్: ఐటీ రంగంలో 13.7 ల క్షల ఉద్యోగాలు ప్రత్యక్షం గాను, 10.5 లక్షల ఉద్యోగాలు పరోక్షంగానూ లభించనున్నాయని ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మాదాపూర్ ఆవాస హోటల్‌లో మంగళవారం అమెరికన్ ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, రానున్న కాలంలో నగరంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందన్నారు.
విద్యార్థులు విదేశీ చదువులు అభ్యసించేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం 74 శాతం ఐటీ ఎగుమతులు చేస్తున్నామన్నారు. నగరంలో పెట్టుబడుల కోసం అమెరికా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. కార్యక్రమంలో అమెరికన్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ మీనన్, పలువురు ఐటీ కంపెనీల ప్రముఖులు పాల్గొన్నారు.