ఈ కారులో ఏది అనుకుంటే అదే జరుగుతుంది..!
మ్యునీచ్: 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా మనందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ సినిమా సంచలన విజయాన్ని నమోదుచేసింది. అవతార్ సినిమా ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు కనువిందుచూసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాలను గమనించే ఉంటాం. ఇదే తరహాలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కారును రూపొందించింది.
చదవండి: Mercedes EQE Electric Sedan: టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..!
మెర్సిడెజ్ ఈ కారులో స్టీరింగ్‌ను అమర్చలేదు. కేవలం హ్యూమన్ మైండ్ ద్వారా నియంత్రించవచ్చును. మెర్సిడెజ్ జెంజ్ విజన్ ఎవీటీర్ న్యూవెర్షన్‌ను జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఐఏఏ మొబిలీటీ 2021 షోలో మెర్సిడెజ్ ప్రదర్శనకు ఉంచింది. కారు లోపలి బయటి భాగాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్న మాదిరిగా ఉంటాయి. ఈ కారులో ఎలాంటి స్టీరింగ్ ఉండదు.
బీసీఐ టెక్నాలజీ సహయంతో కారును నియంత్రించవచ్చును. బీసీఐ టెక్నాలజీ అనగా మీరు కారులో రేడియో స్టేషన్‌ను మార్చడం, లేదా కార్ లోపలి లైట్స్కోసం ఎలాంటి బటన్స్‌ను స్విచ్ చేయకుండా మైండ్‌లో వాటి గురించి ఆలోచించడంతోనే స్విచ్ఆన్, ఆఫ్ చేయవచ్చును. బీసీఐ సిస్టమ్ పనిచేయడం కోసం కంపెనీ తయారుచేసిన ప్రత్యేకమైన హెల్మెట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ సహాయంతో కారును నియత్రించవచ్చును. ఈ కారును డిస్నీ సంస్ధ సహకారంతో మెర్సిడెజ్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఈ కారు కాన్సెప్ట్‌ను అవతార్ సినిమా నుంచి మెర్సిడెజ్ ప్రేరణ పొందింది.
IN PICS | Mercedes-Benz Vision AVTR concept can read your mind
The automaker has created this concept car in collaboration with @Disney and it takes inspiration from the movie popular sci-fi movie, #Avatar. @IAAmobility
Details: https://t.co/svdJLFDUts pic.twitter.com/dd6QWN4D7X
— HT Auto (@HTAutotweets) September 7, 2021
చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..!