ఇది మైండ్ కంట్రోల్డ్ కారు
రిమోట్ కంట్రోల్ కార్లను చూశాం. డ్రైవర్ లేని కార్ల గురించి విన్నాం. అయితే కారు సీట్లో కూర్చుని మనం చేసే సూచనలకనుగుణంగా నడిచే కారును గురించి ఎప్పుడైనా విన్నారా? అద్భుతంగా ఉంది కదూ.. ఈ నూతన సాంకేతికత. చైనాకు చెందిన కొందరు విద్యార్థులు ఈ రకమైన కారును తయారుచేశారు. చైనాలోని నాన్‌కాయ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం మైండ్‌తో నియంత్రించే ఈ నూతన కారును రూపొందించింది.
మెదడు సంకేతాల ద్వారా ఈ కారును నియంత్రించవచ్చు. అందుకోసం ఎలక్ట్రో ఎన్సిఫలో గ్రాఫ్ అక్విసిషన్ పరికరాన్ని తలకు ధరించాలి. ఈ పరికం ద్వారా మెదడు సంకేతాలు కంప్యూటర్‌ను చేరుతాయి. ఈ తరంగాలు కారును నియంత్రించేందుకు తోడ్పడుతాయి. ప్రస్తుతం ఈ కారును పరీక్షలో భాగంగా యూనివర్సిటీలో ఉంచారు. త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి విడుదల చేస్తామని విద్యార్థుల బృందం తెలిపింది.