mineral reserves
-
ఉక్రెయిన్ ఖనిజ కాంతులు
అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన ఖనిజాల ఒప్పందంపై సఫలీకృతం కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన వివాదాస్పద ఓవల్ ఆఫీస్ సమావేశం తర్వాత అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఆశించిన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరగలేదు.ప్రతిపాదిత పునర్నిర్మాణ పెట్టుబడి నిధి "ఖనిజాలు, హైడ్రోకార్బన్లు, చమురు, వాయు నిక్షేపాలను" సూచిస్తోంది. మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లతో సహా హైటెక్ ఉత్పత్తుల తయారీకి కీలకమైన లోహాలపై ట్రంప్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.ఓ వైపు రష్యాతో యుద్ధం.. మరో వైపు అమెరికాతో ఖనిజాల ఒప్పందం నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజ సంపద ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను కలిగి ఉన్నట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. దీని ప్రకారం.. ఇది ఐరోపాలో అత్యంత ఖనిజ వనరులు కలిగిన దేశాలలో ఉక్రెయిన్ ఒకటి. ఇక్కడ లిథియం, టైటానియం, యురేనియం నిల్వలు అధికంగా ఉన్నాయి.ఖనిజ వనరుల సంపదఉక్రేనియన్ జియాలజికల్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచంలోని ఖనిజ వనరులలో సుమారు 5% కలిగి ఉంది. వీటిలో అమెరికా కీలకమైనవిగా భావించే 50 పదార్థాలలో 23 ఉన్నాయి. ఉక్రెయిన్ వైవిధ్యమైన భౌగోళిక భూభాగం విలువైన ఖనిజాల విస్తృత శ్రేణికి నిలయంగా ఉంది.లిథియం నిల్వలుఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి నిల్వలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలకు కీలకమైన భాగం. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు మళ్లడం వల్ల లిథియంకు పెరుగుతున్న డిమాండ్ ఉక్రెయిన్ లిథియం నిక్షేపాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలిజేస్తోంది.టైటానియం నిల్వలుఏరోస్పేస్, సైనిక, వైద్య అనువర్తనాలకు కీలక లోహమైన టైటానియం నిల్వలు ఉక్రెయిన్‌లోనే అధికంగా ఉన్నాయి. ప్రపంచంలో వెలికితీస్తున్న టైటానియం ఖనిజంలో 7 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.యురేనియం నిల్వలులిథియం టైటానియంతో పాటు , ఉక్రెయిన్ ఐరోపాలో అతిపెద్ద యురేనియం నిల్వలకు నిలయంగా ఉంది. ఇది అణుశక్తి ఉత్పత్తికి ఒక కీలక వనరు. ఇక్కడి యురేనియం నిక్షేపాలు ప్రపంచ ఇంధన అవసరాలకు సహకరిస్తూ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి.భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలుఉక్రెయిన్ ఖనిజ సంపద వ్యూహాత్మక ప్రాముఖ్యత అతిశయోక్తి కాదు. డిఫెన్స్, హైటెక్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలకు ఈ వనరుల అందుబాటు కీలకం. రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ, కీలకమైన ఖనిజాల కోసం ప్రపంచ పోటీ ఉక్రెయిన్ నిక్షేపాలపై ఆసక్తిని పెంచింది.సవాళ్లు.. అవకాశాలుఉక్రెయిన్ ఖనిజ సంపద గణనీయమైన అవకాశాలను అందిస్తుండగా, పరిగణించవలసిన సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ కు గణనీయమైన మూలధన పెట్టుబడి సాంకేతిక నైపుణ్యం అవసరం. అదనంగా, రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ మైనింగ్ కార్యకలాపాల స్థిరత్వం భద్రతకు ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అవసరమైన వనరుల ప్రధాన ప్రపంచ సరఫరాదారుగా ఉక్రెయిన్ సామర్థ్యం బలంగా ఉంది. ఈ దేశం తన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం గణనీయమైన ఆర్థిక లాభాలను ఇస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుల వైవిధ్యతకు దోహదం చేస్తుంది. -
రాజస్థాన్‌లో భారీగా బయటపడ్డ లిథియం నిక్షేపాలు.. ఇక చైనాకు చెక్ పడ్డట్టే!
జైపూర్: అత్యంత ఖరీదైన లిథియం ఖనిజ నిల్వలు రాజస్తాన్‌లో భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో డేగానా(నాగౌర్)లోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), మైనింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్తాన్‌లో అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80 శాతం అవసరాలను రాజస్తాన్‌లోని నిల్వలు తీర్చగలవని అన్నారు. భారత్ లిథియం కోసం ప్రధానంగా చైనాపై ఆధారపడుతోంది. తాజాగా బయటపడిన నిల్వలతో చైనా గుత్తాధిపత్యానికి తెరపడడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోనే ఈ ఖనిజం ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీలో లిథియం ఉపయోగిస్తున్నారు. -
నౌరు- విస్తీర్ణంలో చిన్న... పర్యాటకంలో పెద్ద
పేరులో నేముంది దక్షిణ పసిఫిక్‌లో అతి చిన్న గణతంత్ర రాజ్యంగా... విస్తీర్ణంలో వాటికన్ సిటీ, మొనాకోల తర్వాత మూడవ అతి చిన్న దేశంగా పేరున్నప్పటికీ పర్యాటక పరంగా మాత్రం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పేరుంది నౌరుకి. దాదాపు పదివేల జనాభాతో ఉన్న ఈ దేశం మంచి వేసవి విడిదిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. చాలా సంవత్సరాలపాటు అనేక దేశాల ఆధిపత్యం కింద, పెత్తనం కింద నలిగి పోయి ఉన్న నౌరు 1968లో స్వతంత్ర దేశంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఈ దేశంలో అత్యధిక స్థాయిలో ఫాస్పేట్ రాతి ఖనిజ నిల్వలు ఉన్నందువల్ల మొదట్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్వతంత్ర రాజ్యంగా తనను తాను ప్రకటించుకుంది. అయితే ఫాస్పేట్ ఖనిజాన్ని విచ్చలవిడిగా వెలికితీయడం వల్ల అతి కొద్దికాలంలోనే ఖనిజ నిల్వలన్నీ అంతరించి పోవడంతో పేద దేశాల సరసన చేరింది, ఆ తర్వాత భౌగోళికంగా, నైసర్గికంగా, ప్రకృతి రమణీయకత పరంగా నౌరుకు కొన్ని సౌలభ్యాలు ఉండడంతో పర్యాటక పరంగా బాగా అభివృద్ధి సాధించింది. ప్రపంచ దేశాలన్నీ నౌరును తమ వేసవి విడిదిగా చేసుకోవడంతో భారీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి మళ్లీ సంపదను సముపార్జించి, ధనిక దేశంగా తిరిగి పేరు తెచ్చుకుంది. -
అక్రమార్కుల కనుసన్నల్లో లేట‘రైట్ రైట్’
యథేచ్ఛగా తవ్వకాలు అధికారుల వత్తాసు? పాడేరు : ఏజెన్సీలోని అపారమైన ఖనిజ నిల్వలను దోచుకునేందుకు బడాబాబులు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బినామీ పేర్లతో రూ.కోట్లు విలువైన లేటరైట్, రంగురాళ్ళను తవ్వుకునేందుకు భారీ వ్యూహరచన చేస్తున్నారు. గిరిజన హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అనుమతులు పొందేందుకు కూడా మైదాన ప్రాంతంలోని కొంతమంది గిరిజనేతరులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలో విలువైన లేటరైట్‌ను బినామీ పేర్లతో గిరిజనేతరులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. 2002లో ఒక గిరిజనుడికి లేటరైట్ తవ్వకాలపై అనుమతులు ఇచ్చినప్పటికి తర్వాత రోజుల్లో ఏజెన్సీలోని ఖనిజ సంపద పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2012లో అప్పటి ఆర్డీవో ఎం.గణపతిరావు లేటరైట్‌తోపాటు ఏ ఖనిజం తవ్వకాలకు అనుమతులు లేవంటూ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా ఈ నివేదిక వెళ్లింది. డుంబ్రిగుడ మండలంలోని లేటరైట్ తవ్వకాల కోసం స్థానిక గిరిజనులే దరఖాస్తులు చేసుకున్నా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ పాత అనుమతులతో రాజుపాకలు సమీపంలో లేటరైట్ తవ్వకాలు ప్రస్తుతం దర్జాగా సాగిపోతున్నాయి. దీనిని గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గనుల శాఖ అధికారులైతే తవ్వకందారులనే ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం లేటరైట్ ఖనిజం డుంబ్రిగుడ, జీకేవీధి, నాతవరం తదితర ప్రాంతాల్లో భారీగా ఉంది. దాని తవ్వకాలకు బడా వ్యాపారులంతా దొడ్డిదారిన అనుమతులు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఏజెన్సీలోని పలు చోట్ల విలువైన రంగురాళ్ల నిక్షేపాలు కూడా ఉన్నాయి. వీటి తవ్వకాలపై కూడా నిషేధం ఉంది. అయినప్పటికి అధికారులను మచ్చిక చేసుకొని రంగురాళ్ల తవ్వకాలకు కూడా పేరొందిన రంగురాళ్ల వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ లేటరైట్, రంగురాళ్ల క్వారీల అన్వేషణలో బడాబాబులు ఉన్నారు. స్థానిక గిరిజనులను మచ్చిక చేసుకొని విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు బడావ్యాపారులంతా మన్యంలో మకాం వేశారు. ప్రస్తుతం లేటరైట్, రంగురాళ్ల తవ్వకాలను గిరిజనులు ప్రోత్సహిస్తే మున్ముందు బడా వ్యాపారులంతా బాక్సైట్‌ను కూడా తవ్వుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా గిరిజన మేధావులు, యువత, స్వచ్ఛంద సంస్థలంతా గిరిజన ఖనిజ సంపదను పరిరక్షించేందుకు ఉద్యమించాల్సి ఉంది.