Mini Reservoir
-
సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి/చీమకుర్తి: ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్ పేరును బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ ఇటీవల హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ ఆ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల రిజర్వాయర్‌గా నామకరణం చేస్తూ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ -
రైతన్నల ఆశలు ఆవిరి
♦ ఏళ్ల తరబడి సాగుతున్న భవనాశి మినీ రిజర్వాయరు పనులు ♦ ప్రాజెక్టు వ్యయం రూ.27 కోట్లు ♦ ఏయేటికాయేడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్న రైతులు ♦ పనులు పూర్తికాకపోవడంతో నైరాశ్యంలో రైతాంగం పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల ఉదాసీనతో తెలియదు కానీ, కోట్లకు కోట్లు ఖర్చుచేసి కడుతున్న ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తికాకపోవడంతో పచ్చని పంట పొలాలుగా మారాల్సిన భూములు బీడువారి రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. 7 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రారంభించిన భవనాశి రిజర్వాయర్ పనులు నత్తకు నడకలు నేర్పుతూ పాలకుల ఉదాసీనతకు ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నారుు. అద్దంకి : అద్దంకి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో భవనాశి చెరువును మినీ రిజర్వాయరుగా మార్చాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. తద్వారా ప్రస్తుతం ఉన్న 1798 ఎకరాల ఆయకట్టును పెంచి, 7 వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్‌డ్యామ్ నిర్మించి, దాని నుంచి ఫీడరు చానల్ ఏర్పాటుతో, చెరువుకు నీరు తెచ్చి మినీ రిజర్వాయరుగా మార్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జలయజ్ఞంలో ప్రాజెక్టుగా గుర్తింపునిచ్చి, రూ.27 కోట్ల నిధులు కేటాయించారు. 2008లో దేవస్థానానికి ఎదురుగా పనుల ప్రారంభం కోసం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. 2010 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రారంభంలోనే జాప్యం: వెంటనే పనులు మొదలు పెట్టాల్సిన కాంట్రాక్టరుకు రెవెన్యూ శాఖ నుంచి భూముల అప్పగింత కార్యక్రమం పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు 2013లో రెవెన్యూ శాఖ భూముల అప్పగింతతో పనులు మొదలయ్యాయి. రిజర్వాయరు పనులు మూడు భాగాలుగా విభజన.. మినీ రిజర్వాయరు పనులను మూడు భాగాలుగా విభజించారు. ప్రాజెక్టుకు కేటాయించిన రూ.27 కోట్ల నిధుల్లో రూ.7.35 కోట్లు గుండ్లకమ్మ నదిలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి కేటాయించగా ఆ పనులు పూర్తయ్యాయి. పూర్తై చెరువు కట్ట ఎత్తుపెంపు పనులు.. రిజర్వాయరు పనుల్లో రెండో భాగమైన భవనాశి చెరువు కట్ట ఎత్తుపెంపు, చక్రాయపాలెం వద్ద 200 మీటర్ల పొడవున అలుగు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని కోసం రూ.1.71 కోట్లు కేటాయించారు. నిలిచిన ఫీడర్ చానల్ పనులు.. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం చెక్‌డ్యామ్ నుంచి మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల, చక్రాయపాలెం వరకూ 12.6 కిలోమీటర్ల ఫీడర్ చానల్ నిర్మాణం కోసం 192 ఎకరాల భూమిని సేకరించి రూ.13.74 కోట్లు కేటాయించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ప్రస్తుతం వెంపరాల చెరువు నుంచి చక్రాయపాలెం వరకూ కాలువ తీశారు. ప్రాజెక్టు సర్వేలో గుర్తించని 7.25 ఎకరాల భూమితో చిక్కు.. ప్రాజెక్టు కాలువ కోసం సేకరించిన భూమిలో మండలంలోని మైలవరం, ఉప్పలపాడు గ్రామాల రైతులకు చెందిన 7.25 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో చేర్చకపోవడంతో ఆ భూముల్లో కాలువ తవ్వేందుకు ఆటంకం ఏర్పడింది. కొత్తగా వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం ఆ భూముల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే అక్కడ కాలువ తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ పనిని రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంది. నిలిచిన బ్లాస్టింగ్ పనులు.. తీసిన కాలువలో చట్టు(రాయి) పడటంతో దాన్ని బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. బ్లాస్టింగ్‌కు అనుమతి తెచ్చి పనులు మొదలు పెట్టినా, ధ్వనుల మోతకు మైలవరం, ఉప్పలపాడు గ్రామాల్లో ఇళ్లు నెర్రెలిస్తున్నాయని స్థానికులు ఆందోళన చేయడంతో ఆ పనులు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాల అడ్డంకులు.. ఇదే కాలువలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండటం, వాటిని తొలగించడానికి విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు రాకపోవడంతో తీసిన కాలువలోనూ పనులు జరగటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కదలాల్సిన యంత్రాంగాలు.. ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే అటు రెవెన్యూ, ఇటు విద్యుత్ శాఖ అధికారుల నుంచి అనుమతుల మంజూరు, నష్టపరిహారం ఇవ్వాల్సిన రైతులకు రెవెన్యూ శాఖ ద్వారా నష్టపరిహారం ఇవ్వడంతోపాటు, బ్లాస్టింగ్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాలు జిల్లా ఉన్నతాధికారులు గమనించి ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు వేడుకొంటున్నారు. -
మేడారంలో ఇక.. శాశ్వత పనులు
హన్మకొండ, న్యూస్‌లైన్: మేడారంలో ఇక... శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు పనులు చేస్తున్న విషయం తెలిసిందే. జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఉంటుండడంతో శాశ్వత పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఆరో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సైతం శాశ్వత పనుల కోసం నివేదికలివ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. మేడారంలో ఎలాంటి పనులు చేపట్టాలి... ఎక్కడెక్కడ చేయాలి... భూ సేకరణ ఎంత అవసరం వంటి అంశాలపై సర్వే చేసేందుకు నాలుగు శాఖలకు నిధులిచ్చారు. అంతేకాకుండా... సర్వే కోసం రూ. పది లక్షలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే జాతరను పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం శాశ్వత పనులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం సోమవారం నుంచే అధికారులు సర్వే మొదలుపెట్టారు. జాతర సమయంలోనే కాకుండా... మిగతా రోజుల్లో భక్తుల రాక ఎలా ఉంది... వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలపై సమగ్ర నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యూరు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ సేకరణ, అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు, వారి నుంచి కొనుగోలు తదితర పనుల కోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. శాఖల వారీగా చేపట్టనున్న పనులు ఆర్డబ్ల్యూఎస్ : మేడారంలో నీటి తిప్పలు లేకుం డా రూ. 11 కోట్లతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శాశ్వత పనులను చేపట్టనున్నారు. మేడారం చుట్టూ పంట కాల్వల నుంచి లోతుగా (అండర్ గ్రౌండ్) పైపులైన్ నిర్మించి, ప్రధాన దారుల వద్ద నల్లాలు, మినీ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. గుట్టలు, చెట్ల మధ్య విడిది చేసే భక్తులకు ఇబ్బందులు రాకుండా తక్కువ వ్యవధిలోనే నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. నీటి సరఫరాకు ఇబ్బం దులు రాకుండా పడిగాపూర్, రెడ్డిగూడెం గుట్టల వద్ద రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు, జంపన్నవాగులో రెండు ఫిల్టర్ బావులను తవ్వనున్నారు. వీటి ద్వారా ట్యాంకులు... అక్కడ నుంచి పైపులైన్లకు లింక్ చేయనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం గ్రామపంచాయతీ అనుమతితో ఆర్డబ్ల్యూఎస్ మినీ కార్యాలయాన్ని నిర్మించుకోనున్నారు. కొంతమంది సిబ్బందిని కేటాయించనున్నారు. ఆర్ అండ్ బీ : మేడారం చుట్టూ ఉన్న ఊరట్టం, రెడ్డిగూడెం, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూర్, నార్లాపూర్, పడిగాపూర్ గ్రామాల నుంచి ప్రధాన రోడ్లను మరింత వెడల్పు చేయడమే కాకుండా... మేడారం వచ్చే ఈ దారుల వెంట ప్రత్యేక ఏర్పా ట్లు చేయనున్నారు. పంట పొలాలకు ప్రమాదం వాటిల్లకుండా రోడ్ల వెంట మురికి కాల్వల నిర్మాణం చేయనున్నారు. అదే విధంగా ప్రధాన ప్రాంతాల్లో నల్లాలను బిగించనున్నారు. మేడారంలో సమ్మక్కను దర్శించుకున్న భక్తులు ఈ చుట్టూ గ్రామాల్లో ఎక్కడైనా సేద తీరవచ్చు. జాతర సమయంలోనే కాకుండా... ఈ దారుల వెంట ప్రత్యేక స్తంభాలను వేసి, విద్యుత్ సరఫరా చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ : జంపన్న వాగులో చెక్ డ్యాంల నిర్మాణానికి బ్రేక్ పడనుంది. ఇక్కడ మినీ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇప్పటివరకు సుమారు 10 చెక్ డ్యాంలను నిర్మాణం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిం చారు. కానీ.. జాతర సమయంలో కాకుండా వివిధ రోజుల్లో వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నారుు. ఈ మేరకు జంపన్న వాగును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. 8.8 కోట్లతో మినీ రిజర్వాయర్ు నిర్మాణం చేసి, కట్టపైన మినీ పంపింగ్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. జంపన్నవాగు నుంచి స్నాన ఘట్టాలకు లింక్ చేయనున్నారు. దీంతో ప్రతిసారి స్నాన ఘట్టాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే... ఈ ప్రాంతంలోని పంట పొలాలకు కూడా కొంత లాభం చేకూరే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ : జాతర సమయంలో స్తంభాలు వేయడం, ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం వంటి పనులను కాదని... ప్రతిరోజూ వినియోగంలో ఉండే విధంగా రూ. 2.80 కోట్లతో విద్యుత్ పనులను శాశ్వత ప్రాతిపాదికన చేయనున్నారు. మేడారంతోపాటు చుట్టూ గ్రామాల పరిధిలో విద్యుత్ లైన్లు వేయనున్నారు. పస్రా నుంచి మేడారం వరకు స్తంభాలు వేయనున్నారు. అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సరఫరాకు 200 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు నిరంతరం నడిచే విధంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇలా అరుుతే.. ప్రతీ జాతర సమయంలో వెచ్చిస్తున్న నిధులు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. కేవలం ఎనర్జీ చార్జీలు, నిర్వహణ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.