minister ayyannapathrudu
-
విశాఖలో హాట్‌టాపిక్‌గా మారిన మంత్రి ప్రవర్తన
-
సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలి
నర్సీపట్నం: బీజేపీ నాయకులు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని మార్కెట్‌యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే స్థాయి వీర్రాజుకు లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పుడిందని మాట్లాడటం సరికాదన్నారు. పదే పదే ఆరోపణలు చేయటం మానుకోని ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చమని అడుగుతున్నామే తప్ప కొత్త ఏమీ అడగలేదన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏపీని తన సొంత రాష్ట్రంలా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్ర«శ్నించారు. నాలుగైదు పార్టీలను మార్చిన పురందేశ్వరికి టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు. -
కత్తులు దూసిన పందెం కోళ్లు
సాక్షి, అమరావతి : కోర్టు ఓడిపోయింది. కోడే గెలిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి పండుగ రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు తరలిరావడంతో విజయవాడలోని హోటళ్లు, లాడ్జిలు రద్దీగా మారాయి. బరిలో టీడీపీ ప్రముఖులు అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు పందేలను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో కోడి పందేలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో పందేలను ఎమ్మెల్యే గన్నివీరాంజనేయులు ప్రారంభించారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో పందేలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడే పొట్టేళ్ల పందేలు కూడా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో పందేలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరంభించారు. గుంటూరుజిల్లా చెరుకుపల్లి మండలంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో బరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పందేలకు తెర తీశారు. జిల్లాల్లో పందేల జోరు.. కోర్టు నిషేధం ఉన్నప్పటికీ ఈ ఏడాది భారీ స్థాయిలో బరులు ఏర్పాటుచేశారు. గత ఏడాది నిర్వహించిన ప్రాంతాలలో కాకుండా చాలా చోట్ల ఈ సారి కొత్త ప్రాంతాలలో బరులు ఏర్పాటు చేయడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వరకు కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా యత్నించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు మొదలయ్యాయి. యలమంచిలిలోని గుంపర్రులో పందేలను తిలకించేందుకు పలువురు సినీ కమెడియన్లు వచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. దెందులూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు జరుగుతున్నాయి. భీమవరం నియోజకవర్గంలో వెంప, వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, మత్స్యపురి గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు, పాలకొల్లు, ఉండి, చింతలపూడి, ఆచంట, నరసాపురం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో భారీగా పందేలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం గ్రామంలో 30 ఎకరాల భూమిలో భారీ స్థాయిలో బరి ఏర్పాటు చేసి పందేలు చేపట్టారు. కోడిపందేలతో పాటు గుండాట, కోత ముక్క వంటి జూదాలు కూడా నిర్వహించారు. డబ్బు బయటికి కనబడకుండా పందేల వద్ద కాయిన్ విధానం ప్రవేశపెట్టారు. తొలుత కత్తులు లేకుండా పోటీలు ప్రారంభించి.. అనంతరం కత్తులు కట్టి యథావిధిగా పందేలు నిర్వహించారు. సెల్ ఫోన్లలో పందేల నిర్వహణను ఫొటోలు తీయకుండా నియంత్రించేందుకు దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తలను నియమించారు. విజయవాడ శివారు ప్రాంతంమైన పెనమలూరు నియోజకవర్గంలో ఈడ్పుగల్లు వద్ద భారీ బరిని నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో దాదాపు 10చోట్ల బహిరంగంగా బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడిపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు, జూదం శిబిరాలు యథేచ్ఛగా నిర్వహించారు. ఈడ్పుగల్లులో జరిగిన పొట్టేళ్లు, కోడిపందేలకు హైదరాబాద్, తెలంగాణా, కర్ణాటక నుంచి గొర్రెపొట్టేళ్లు, కోళ్లతో పందెందారులు తరలివచ్చారు. కోస్తా జిల్లాల నుంచి కూడా కోడి పందెం దారులు తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో గోడి, రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో జరిగాయి. ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో పందేలు జోరుగా సాగాయి. కోట్లలో పందేలు ఆదివారం భోగి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాటలలో దాదాపు రూ. 200 కోట్ల మేర డబ్బు చేతులు మారిందని వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ. 150కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రోజు రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ. 3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగాయని అంచనా వేస్తున్నారు. -
మావోల హెచ్చరికలున్నా భద్రత ఇదేనా?
నర్సీపట్నం: మంత్రి అయ్యన్న సోదరుడి కారులో నాలుగు నెలల క్రితం వాయిస్ రికార్డర్ అమర్చినట్లు తేలడం ఇంటెలిజన్స్, పోలీసు వర్గాలకు సవాల్ విసిరినట్లైంది. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రముఖంగా వచ్చిన కథనం పట్టణంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి మంత్రి అయ్యన్న తనయుడు విజయ్ లేటరైట్ దందాలకు పాల్పడుతున్నారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆరు నెలలు క్రితం మావోయిస్టులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల దృష్ట్యా మంత్రి అయ్యన్న నివాసంతో పాటు సందర్శించే వారిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కారులో వాయిస్ రికార్డర్ అమర్చడాన్ని బట్టి, ఇంటి భద్రతను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడీ విషయం పట్టణంలో చర్చనీయాశంగా మారింది. రికార్డయిన వాయిస్ ఎప్పటికప్పుడు బయటికి పొక్కిందా..? అన్నది తేలాల్సి ఉంది. మంత్రి నివాసంలో వాహనం పార్కు చేసి ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం నిత్యం ఏదో ప్రాంతానికి సోదరుడి దంపతులతో పాటు ముఖ్య అనుచరులతో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో వారు అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు ఈ రికార్డర్ ద్వారా ఏమేరకు అమర్చిన వ్యక్తులకు చేరి ఉంటాయో పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా బలమైన అంశాలపై జరిగిన చర్చలకు సంబంధించి వాయిస్ రికార్డర్లో నమోదై ఉంటే భవిష్యత్తులో ఎటువంటి పరిణామానాలకు దారి తీస్తుందో.. రికార్డయిన అంశాలు మంత్రిపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లి అందరి నోళ్లలో తలలో నాలుకుగా ఉండే సన్యాసిపాత్రుడి కారులో వాయిస్ రికార్డర్ పెట్టడాన్ని పట్టణ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
'అనంత' దాహం తీరుస్తాం
– శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.985 కోట్లు – విలేకరుల సమావేశంలో మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు అనంతపురం సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసిందని పంచాయతీరాజ్‌శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అథితి గృహంలో గురువారం ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తాగు నీటి ఎద్దడిని తీర్చేందుకు రూ.4,500ల కోట్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నిధుల్లో అత్యధిక శాతం అనంతపురం జిల్లాకు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలోనే జిల్లాలో రూ.985 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రూ.150 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో బోర్ల మరమ్మతులు, మోటార్లు, లీకేజీలు అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. గతేడాది తాగునీటి సరఫరా కోసం జిల్లాలో 500 వాహనాలను ఉపయోగించినట్లు తెలిపారు. బోర్ల నుంచి నీటిని కొనుగోలు చేసినందుకు అందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు జిల్లా కలెక్టర్ విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకు వస్తున్నందున అందులో 20 శాతం నిధులు తాగునీటికి వినియోగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పంచాయతీల్లో శ్మశాన వాటికలు, అండర్ డ్రైనేజీల కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కోసం ఓ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. చిత్రావతి, శ్రీరాంసాగర్, జేసీనాగిరెడ్డి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి ఉంటారన్నారు. సమావేశంలో ఎంఎల్సీ శమంతకమని, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చాంద్‌బాషా, వరదాపురం సూరి, పార్థసారథితో పాటు జెడ్పీ సీఈఓ రామచంద్రయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామ్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ రవికుమార్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.