
నర్సీపట్నం: బీజేపీ నాయకులు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని మార్కెట్‌యార్డులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే స్థాయి వీర్రాజుకు లేదన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పుడిందని మాట్లాడటం సరికాదన్నారు. పదే పదే ఆరోపణలు చేయటం మానుకోని ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చమని అడుగుతున్నామే తప్ప కొత్త ఏమీ అడగలేదన్నారు.
ఎన్నికల సమయంలో తిరుపతి బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏపీని తన సొంత రాష్ట్రంలా అభివృద్ధి చేస్తానని ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్ర«శ్నించారు. నాలుగైదు పార్టీలను మార్చిన పురందేశ్వరికి టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment