మంత్రి ఇలాఖాలో ప్రజల కష్టాలు
చెంతనే నీరున్నా.. అందని దుస్థితి.. కనగానపల్లి (రాప్తాడు) మండలం ముక్తాపురం మోడల్ కాలనీకి ఎదురుగా ఉన్న దళితులది. మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతమైనా జనాలకు ‘జల’కష్టాలు తీరడం లేదు. రెండు బోర్లు వేయించినా కాలనీవాసులకు మాత్రం నీటి కష్టాలు తీరడం లేదు. బోర్లకు పైప్లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిత్యం వారంతా ఇదిగో ఇలా రోడ్డు మీదకొచ్చి అష్టకష్టాలు పడుతున్నారు.
– సాక్షి ఫోటోగ్రాఫర్, అనంతపురం