minister die
-
హెన్రీ కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ దౌత్య నిపుణుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ విధానం రూపశిల్పిగా పేరుగాంచిన హెన్రీ కిసింజర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు వందేళ్లు. చాలా రోజులుగా అనారోగ్యంగో బాధపడుతున్న కిసింజర్ కనెక్టికట్‌లో తన నివాసంలో బుధవారం కన్నుమూశారని ఆయన కన్సల్టెంగ్ కంపెనీ ‘కిసింజర్ అసోసియేట్స్’ ప్రకటించింది. అమెరికా విదేశాంగ విధానం గురించి ఎక్కడ చర్చ జరిగినా కిసింజర్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. అంతలా ఆయన తనదైన ముద్ర వేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొన్న కిసింజర్ 21వ శతాబ్దంలోనూ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేశారు. ఏకకాలంలో రెండు కీలక పదవులు కిసింజర్ 1923 మే 27న జర్మనీలోని బవేరియన్ సిటీలో జని్మంచారు. యూదు మతస్తుడైన కిసింజర్ 1938లో తన కుటుంబంతో కలిసి అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మన్హట్టన్లో స్థిరపడ్డారు. మాతృభాష జర్మన్. ఇంగ్లిష్ భాష అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకున్నప్పటికీ చనిపోయేదాకా జర్మన్ యాస మాత్రం ఆయనను వదల్లేదు. న్యూయార్క్ సిటీలోని జార్జి వాషింగ్టన్ హైసూ్కల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత అమెరికా సైన్యంలో చేరారు. మాతృదేశం జర్మనీలో అమెరికా తరఫున పోరాడారు. నిఘా విభాగంలో పనిచేశారు. జర్మనీలో నాజీలను ఓడించేందుకు తన వంతు సేవలందించారు. ఆయనకు ‘బ్రాంజ్ స్టార్’ లభించింది. తర్వాత అమెరికాకు తిరిగివచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పరిజ్ఞానం పెంచుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నేత, న్యూయార్క్ గవర్నర్ నెల్సన్ రాక్ఫెల్లర్కు సలహాలు ఇచ్చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రైమరీల్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు రిచర్డ్ నిక్సన్ విజయం సాధించారు. దాంతో కిసింజర్.. నిక్సన్ వర్గంలో చేరిపోయారు. నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కిసింజర్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 1973లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో రెండు కీలక పదవుల్లో కిసింజర్ చక్రం తిప్పారు. కిసింజర్ తర్వాత అమెరికాలో ఈ రెండు పదవులను ఒకేసారి ఎవరూ నిర్వర్తించలేదు. వాటర్‌గేట్ కుంభకోణంలో నిక్సన్ రాజీనామా చేయడంతో అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ హయాంలోనూ కిసింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలందించారు. వియత్నాంలో అమెరికా యుద్ధానికి ముగింపు పలికేలా చొరవ తీసుకున్నందుకు 1973లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య ఘర్షణలను నివారించడంలో కీలక పాత్ర పోషించారు. అత్యంత శక్తివంతమైన దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. ఆయనకు మొదటి భార్య ద్వారా ఎలిజబెత్, డేవిడ్ జన్మించారు. భారత వ్యతిరేక వైఖరి విదేశాంగ మంత్రిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. కార్పొరేషన్లకు, రాజకీయనాయకులకు, ప్రపంచ స్థాయి నేతలకు సలహాలు ఇస్తుండేవారు. సభలు, సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రపంచ పరిణామాలపై తనఅభిప్రాయాలు వెల్లడించేవారు. పలు చిన్న, దుర్బల దేశాలపై అమెరికా యుద్ధాలు, దాడుల వెనుక కిసింజర్ దుష్ట రాజనీతి ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనను యుద్ధ నేరగాడిగా పలు దేశాలు అభివర్ణించాయి. కిసింజర్ రెండు సార్లు చైనాలో పర్యటించారు. సోవియట్ రష్యాకు చెక్ పెట్టడానికి చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 1971లో భారత్–పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది. దీని వెనుక కిసింజర్ ఒత్తిడి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో భారత్‌ను కిసింజర్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. తరచూ విమర్శలు చేస్తుండేవారు. భారత్‌ను తప్పుపట్టినందుకు ఆ తర్వాతి కాలంలో ఆయన తన సన్నిహితుల వద్ద పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
Chandan Ram Das: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సాంఘీక సంక్షేమ, రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్(63) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బగేశ్వర్ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. చందన్ రామ్ దాస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 'నా కేబినెట్ మంత్రి హఠాన్మరణం విస్మయానికి గురి చేసింది. ఆయన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సామాజిక సేవ, రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిది.' అని ధామీ ట్వీట్ చేశారు. मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्री चंदन राम दास जी के आकस्मिक निधन के समाचार से स्तब्ध हूं। उनका निधन जनसेवा एवं राजनीति के क्षेत्र में अपूरणीय क्षति है। ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं परिजनों व समर्थकों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। ॐ… pic.twitter.com/BMTuaI62sr — Pushkar Singh Dhami (@pushkardhami) April 26, 2023 కాగా.. మంత్రి మృతికి సంతాపంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. చందన్ రామ్ దాస్ 2007 నుంచి వరసగా నాలుగు సార్లు బగేశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధామీ కేబినెట్లోనే తొలిసారి ఆయనకు మంత్రి అవకాశం దక్కింది. చదవండి: సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు..! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..? -
Covid-19: ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత
లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి బలయ్యాడు. కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు కన్నుమూశాడు. విజయ్ కశ్యప్ (56) ముజఫర్‌నగర్ జిల్లా చర్తవాల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రులు ముగ్గురయ్యారు. ఇటీవల విజయ్ కశ్యప్ కరోనా బారినపడ్డాడు. అస్వస్థతకు గురవడంతో గుర్గావ్లోని వేదాంత ఆస్పత్రిలో చేరారు. అతడి ఆరోగ్యం మంగళవారం అర్ధరాత్రి విషమించి మృతి చెందాడు. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులే కరోనాకు బలవుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. వారిలో కశ్యప్‌తో కలిపి ముగ్గురు మంత్రులు చనిపోయారు. -
గుండెపోటుతో సహకారశాఖ మంత్రి మృతి
బెంగళూరు: కర్ణాటక సహకార, చక్కెర శాఖమంత్రి హెచ్ఎస్ మహదేవ ప్రసాద్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. చిక్కమగళూరు జిల్లా కొప్పాలోని ఓ ప్రైవేటు రిసార్టులో బస చేసిన ఆయన తెల్లవారుజామున భారీ గుండెపోటు రావడంతో నిద్రలోనే కన్నుముశారని తెలుస్తోంది. ఆయన వయస్సు 58 ఏళ్లు. కొప్పాలో సహకార ట్రాన్స్పోర్ట్ నెటవర్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం రాత్రి 10.30 గంటలకు చిక్కమగళూరులోని సెరాయ్ రిసార్టులో బస చేశారు. ఉదయం 8.30 గంటలైనా ఆయన తన గది నుంచి బయటకు రావడంతో అనుచరులు వెళ్లి చూడగా.. మహదేవ ప్రసాద్ విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఐదుసార్లు చామరాజన్ నగర్ జిల్లా గుండ్లుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహదేవ ప్రసాద్ సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు.