
లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి బలయ్యాడు. కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు కన్నుమూశాడు. విజయ్ కశ్యప్ (56) ముజఫర్‌నగర్ జిల్లా చర్తవాల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రులు ముగ్గురయ్యారు.
ఇటీవల విజయ్ కశ్యప్ కరోనా బారినపడ్డాడు. అస్వస్థతకు గురవడంతో గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చేరారు. అతడి ఆరోగ్యం మంగళవారం అర్ధరాత్రి విషమించి మృతి చెందాడు. ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం ప్రకటించారు.
కాగా ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కన్నుమూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన నాయకులే కరోనాకు బలవుతున్నారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. వారిలో కశ్యప్‌తో కలిపి ముగ్గురు మంత్రులు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment