గుండెపోటుతో సహకారశాఖ మంత్రి మృతి | Karnataka minister Mahadev Prasad dies | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సహకారశాఖ మంత్రి మృతి

Published Tue, Jan 3 2017 4:56 PM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM

గుండెపోటుతో సహకారశాఖ మంత్రి మృతి - Sakshi

గుండెపోటుతో సహకారశాఖ మంత్రి మృతి

బెంగళూరు: కర్ణాటక సహకార, చక్కెర శాఖమంత్రి హెచ్‌ఎస్‌ మహదేవ ప్రసాద్‌ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. చిక్కమగళూరు జిల్లా కొప్పాలోని ఓ ప్రైవేటు రిసార్టులో బస చేసిన ఆయన తెల్లవారుజామున భారీ గుండెపోటు రావడంతో నిద్రలోనే కన్నుముశారని తెలుస్తోంది. ఆయన వయస్సు 58 ఏళ్లు. 

కొప్పాలో సహకార ట్రాన్స్‌పోర్ట్‌ నెటవర్క్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం రాత్రి 10.30 గంటలకు చిక్కమగళూరులోని సెరాయ్‌ రిసార్టులో బస చేశారు.  ఉదయం 8.30 గంటలైనా ఆయన తన గది నుంచి బయటకు రావడంతో అనుచరులు వెళ్లి చూడగా.. మహదేవ ప్రసాద్‌ విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఐదుసార్లు చామరాజన్‌ నగర్‌ జిల్లా గుండ్లుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహదేవ ప్రసాద్‌ సీఎం సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement