minister pithani
-
సింహవాహినీ శరణు.. శరణు
సాక్షి, విజయవాడ: అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే.. అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో విజయ కీలాద్రి మార్మోగుతుండగా శరన్నవ రాత్రుల్లో తొమ్మిదో రోజు శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అష్ట భుజా లతో అవతరించి, సింహ వాహినియై, త్రిశూలం, అంకుశం మొదలైన ఆయు ధాలు ధరించి ఉగ్ర రూపంలో దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని, శత్రుభయం ఉండ బోదని భక్తుల విశ్వాసం. అమ్మవారిని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకట రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సినీనటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. నేడు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ అమ్మవారు ఉగ్రరూపాన్ని విడిచి శాంతమూర్తిగా చెరకు గడను వామహస్తంతో ధరించి, దక్షిణహస్తంతో అభయాన్ని ప్రసా దింపచేసే విధంగా, చిరునగవులతో రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు విజయదశమి రోజున అమ్మవారు దర్శనమిస్తారు. దశమిరోజు సాయంత్రం కృష్ణా నదిలో గంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి హంస వాహనంపై నదీ విహారం కనులపండువగా సాగనుంది. రంగురంగుల విద్యు ద్దీపాలు, వివిధ రకాలపూలతో అలంకరించిన తెప్పపై వేదపండి తుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, బాణసంచా వెలుగుల్లో అమ్మ వారు, స్వామివార్ల నదీ విహారం అత్యంత మనోహరంగా సాగుతుంది. -
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
పాలకొల్లు సెంట్రల్ : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పాలకొల్లు జట్లు, మిల్లు కార్మిక సంఘం 74వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ కార్మికుడికి భద్రత కల్పించాలి్సన బాధ్యత యాజమాన్యానికి , ప్రభుత్వానికి కూడా ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని ఆలోచిస్తుంటే.. కాలుష్యం పేరుతో వాటిని అడ్డుకోవడానికి కొందరు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్మికుడు లేకుండా యాజమాన్యం లేదు.. యాజమాన్యం లేకుండా కార్మికుడు లేడని చెప్పారు. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుచుకున్నప్పుడే సమస్యలు రావని సూచించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 4 లక్షల మంది కార్మికులు ఉండగా నేడు సుమారు 14 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఇక నుంచి ఈఎస్ఐ సభ్యుడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి్సన అవసరం లేదని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అన్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
మొగల్తూరు ఘటనపై మెజిస్టీరియల్ విచారణ
నరసాపురం: మొగల్తూరు ఆనందా రొయ్యల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఘటనలో మృతిచెందిన కార్మికులకు నష్టపరిహారంగా ఫ్యాక్టరీ ప్రకటించిన రూ.15 లక్షల నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు బుధవారం నరసాపురం మండలం సీతారామపురంలో మంత్రి పితాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనపై ఐఏఎస్ అధికారితో కూడిన బృందంతో విచారణ జరిపిస్తామని, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్, మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీల విషయంలో తాను మాట మార్చలేదన్నారు. జిల్లాలోని యనమదుర్రు డ్రెయిన్‌లో వ్యర్థాలు కలుపుతున్న ఫ్యాక్టరీలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ట్రీట్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని, ఆరు నెలల్లో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఘోరాన్ని రోడ్డు ప్రమాదంతో పోల్చిన మంత్రి మొగల్తూరు ఘటన మంత్రి పితాని రోడ్డు ప్రమాదంతో పోల్చారు. ఫ్యాక్టరీల యాజమాన్యం నిబంధనలు పాటించాలని, కార్మికుల రక్షణపై చర్యలు తీసుకోవాలని చెబుతూనే ఆనందా ఫ్యాక్టరీలో ప్రమాదం అనుకోకుండా జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా ఎలా జరుగుతాయో, ఇదీ అలాగే జరిగిందని వ్యాఖ్యానించడంతో పలువురు నోరెళ్లబెట్టారు. ఊరేగింపుగా సీతారామపురం నరసాపురం ఇరిగేషన్ అతిథి గృహం నుంచి సీతారామపురం వరకూ మంత్రి పితానిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆనందా ఫ్యాక్టరీ ఘటన మృతుల బంధువులను అధికారులు సీతారామపురం రప్పించారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మంత్రి పరామర్శిస్తారని, అక్కడే నష్టపరిహారం కూడా ఇస్తారని అంతా భావించారు. ఫ్యాక్టరీని కూడా మంత్రి పరిశీలిస్తారని అనుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సీతారామపురంలో కార్యక్రమం ఏర్పాటుచేసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఐదుగురి మృతుల్లో నల్లం ఏడుకొండలు బంధువులు రాలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల నష్టపరిహారానికి సంబంధించి రూ.20 లక్షలు అందించామని, మిగిలిన రూ.5 లక్షలు త్వరలో అందజేస్తామని మంత్రి పితాని ప్రకటించారు. ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, మున్సిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల, జిల్లా నీటి సంఘాల అధ్యక్షుడు పొత్తూరి రామరాజు, చినమిల్లి సత్యనారాయణ, అండ్రాజు చల్లారావు, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ పాల్గొన్నారు.