సాక్షి, విజయవాడ: అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే.. అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో విజయ కీలాద్రి మార్మోగుతుండగా శరన్నవ రాత్రుల్లో తొమ్మిదో రోజు శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అష్ట భుజా లతో అవతరించి, సింహ వాహినియై, త్రిశూలం, అంకుశం మొదలైన ఆయు ధాలు ధరించి ఉగ్ర రూపంలో దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని, శత్రుభయం ఉండ బోదని భక్తుల విశ్వాసం. అమ్మవారిని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకట రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సినీనటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు.
నేడు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ
అమ్మవారు ఉగ్రరూపాన్ని విడిచి శాంతమూర్తిగా చెరకు గడను వామహస్తంతో ధరించి, దక్షిణహస్తంతో అభయాన్ని ప్రసా దింపచేసే విధంగా, చిరునగవులతో రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు విజయదశమి రోజున అమ్మవారు దర్శనమిస్తారు. దశమిరోజు సాయంత్రం కృష్ణా నదిలో గంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి హంస వాహనంపై నదీ విహారం కనులపండువగా సాగనుంది. రంగురంగుల విద్యు ద్దీపాలు, వివిధ రకాలపూలతో అలంకరించిన తెప్పపై వేదపండి తుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, బాణసంచా వెలుగుల్లో అమ్మ వారు, స్వామివార్ల నదీ విహారం అత్యంత మనోహరంగా సాగుతుంది.
Published Sat, Sep 30 2017 3:10 AM | Last Updated on Sat, Sep 30 2017 3:10 AM
Advertisement