ammavaru
-
కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు
భివండీ: భివండీ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ పురస్కరించుకొని శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి అమ్మవారికి ఒడి బియ్యం మహోత్సవ కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీపాలతో పాటు వివిధ రంగుల పూలతో వైభంగా ముస్తాబు చేశారు. పద్మశాలీయుల ఆడపడుచైన అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమాలలో పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకుడు ప్రసాద్ స్వామి నేతృత్వంలో జరిగాయి. శనివారం ఉదయం స్వామి వారికి నిత్య పూజలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒడి బియ్యం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి అమ్మవారిని శేషవాహనంపై మందిరం నుంచి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పద్మనగర్ పురఃవీధులు మహాముని చౌక్, దత్తమందిర్, రామ్ మందిర్, గీతా మందిర్, బాజీ మార్కెట్, వరాలదేవి రోడ్ నుంచి తిరిగి రాత్రి 10 గంటల వరకు మందిరాన్ని చేరుకుంది. ఊరేగింపులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీధివీధిన స్వామి వారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. దర్శనం నిమిత్తం బారులు తీరి హారతులు, కానుకలు సమరి్పంచుకున్నారు. సిద్ధివినాయక్ భజన మండలి, గీతా భజన మండలి వారు ఆలకించిన అన్నమయ్య కీర్తనలతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. రాత్రి నిర్వహించిన అన్నదానంలో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యుడు దావత్ కైలాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గౌడ లింగం, బైరి జనార్దన్, డాక్టర్ పాము మనోహర్, వడిగొప్పుల శంకర్ పంతులు, బాలె శ్రీనివాస్, అవధూత బలరామ్, భీమనాథిని శివప్రసాద్, బూర్ల మనోజ్‌తో పాటు వందల సంఖ్యలో పద్మశాలీ కులబాంధవులు భక్తులు పాల్గొని సేవలందించారు. ఇదీ చదవండి : వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు -
అమ్మవారికి బోనం సమర్పించిన షర్మిల
-
సింహవాహినీ శరణు.. శరణు
సాక్షి, విజయవాడ: అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే.. అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో విజయ కీలాద్రి మార్మోగుతుండగా శరన్నవ రాత్రుల్లో తొమ్మిదో రోజు శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. అష్ట భుజా లతో అవతరించి, సింహ వాహినియై, త్రిశూలం, అంకుశం మొదలైన ఆయు ధాలు ధరించి ఉగ్ర రూపంలో దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన అమ్మవారు దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని, శత్రుభయం ఉండ బోదని భక్తుల విశ్వాసం. అమ్మవారిని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దర్శించుకున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోపిదేవి వెంకట రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, సినీనటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. నేడు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ అమ్మవారు ఉగ్రరూపాన్ని విడిచి శాంతమూర్తిగా చెరకు గడను వామహస్తంతో ధరించి, దక్షిణహస్తంతో అభయాన్ని ప్రసా దింపచేసే విధంగా, చిరునగవులతో రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు విజయదశమి రోజున అమ్మవారు దర్శనమిస్తారు. దశమిరోజు సాయంత్రం కృష్ణా నదిలో గంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి హంస వాహనంపై నదీ విహారం కనులపండువగా సాగనుంది. రంగురంగుల విద్యు ద్దీపాలు, వివిధ రకాలపూలతో అలంకరించిన తెప్పపై వేదపండి తుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, బాణసంచా వెలుగుల్లో అమ్మ వారు, స్వామివార్ల నదీ విహారం అత్యంత మనోహరంగా సాగుతుంది. -
కరుణించమ్మా..
వడ్డి పోలమాంబ, కుంచమాంబ జాతర మహోత్సవాలు రాజమహేంద్రవరం నగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తాడితోట రెల్లిపేటలోని అమ్మవార్ల ఆలయాల వద్ద జరుగుతున్న ఈ ఉత్సవాలు ఆదివారం 18వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మరిడమ్మ తల్లి పిడతల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. రెల్లిపేట నుంచి బైపాస్ రోడ్డు, తాడితోట జంక్ష¯ŒS మీదుగా రామకృష్ణ థియేటర్ వీరభద్ర నగర్ వరకూ ఊరేగింపు సాగింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య, కార్యదర్శి ఇంటి వెంకట్ పాల్గొన్నారు. వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. – తాడితోట (రాజమహేంద్రవరం) -
జగన్మాత నమోస్తుతే
-
‘కోటి’ దండాలమ్మా
-
‘కోటి’ దండాలు
అమలాపురం కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్ల కళాకృతులు కోటి రూపాయలకు పైగా నోట్లతో అమ్మవారితోపాటు ఆలయానికి సోయగం అమలాపురం టౌన్ : అమ్మవారిని పూలు, ఫలాలు, పలు పత్ర దళాలతో అలంకరించడం సంప్రదాయం. అక్కడక్కడా కరెన్సీ నోట్ల తోరణాలతో ముస్తాబు చేస్తారు. కానీ అమలాపురంలో వాసవీ కన్యకాపరమేశ్వరినే కాకుండా ఆలయాన్ని కూడా దసరా మహోత్సవాల్లో భాగంగా రూ.1.53 కోట్ల కరెన్సీ నోట్లతో ముంచెత్తారు. అమ్మవారి అంతరాలయం, మండపం గోడలకు రూ.1000, రూ.500 నోట్లతో, ఇక రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5 నోట్లతో పుష్పాలు, దండలు, తోరణాలుగా మలిచి కనువిందు చేశారు. ఆలయం మెుత్తం ఓ కరెన్సీ ఖాజానాగా సాక్షాత్కరించింది. పోలీసుల బందోబస్తు నడుమ ఈ అలంకరణ సాగింది. దీన్ని తిలకించడానికి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా కరెన్సీ కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉప ముఖ్యమంత్రి రాజప్ప, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ఆర్ మూర్తి, ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు సందర్శించారు. -
ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు
రామయ్యకు నిత్యకల్యాణం భద్రాచలం : భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా ఉదయం పంచామృతాలు,నదీ జలాలతో ఆలయ అర్చకులు అభిషేకంను నిర్వహించారు. వేదపండితులచే రామయాణ పారాయణం జరిగింది. మధ్యాహ్నం 3గం.లకు అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణచేసి, భక్తుల దర్శనార్ధం అమ్మవారి ఆలయంలో కొలువు తీర్చారు. గురువారం లక్ష్మీతాయారు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రామయ్యకు ఘనంగా కల్యాణోత్సవం శ్రీసీతారామచంద్ర స్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి బేడా మండపంలో స్వామి వారికి అభిషేకం చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు. -
శ్రీ లలితాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచ రూరల్ : మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం శ్రీ లలితాదేవి అవతారంలో పెద్దమ్మతల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శ్రీ చక్రాఅర్చన, సూర్యనమాస్కార పూజలు నిర్వహించారు. యాగశాలల్లో అర్చకులు హోమ పూజలు నిర్వహించారు. కాగా, శ్రీ దేవిశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ మంగేష్‌కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ సీఈకి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
హంస వాహనంపై అమ్మవారు
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి గంటలకు హంస వాహనంపై శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. -
వరలక్ష్మీ నమోస్తుతే
-
శ్రావణ సందడి
-
శాకంబరిగా అమ్మవారు
-
శాకంబరిగా శక్తిస్వరూపిణి
-
శాకాంబరీ..నమో నమ :
-
వేదఘోషతో పులకరించిన బాసర
బాసర : బాసర అమ్మవారి క్షేత్రం ఆదివారం వేదఘోషతో పుల కరలించింది. గురుపౌర్ణమి ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. తొమ్మిది గంటలకు ఆలయం నుంచి ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వర్లు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో వేద వ్యాస ఆలయానికి బయలు దేరారు. వేదవ్యాస ఆలయంలో అర్చకులు నిర్వహించారు. యాగ మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల «మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, మంటపారాధన, చండీపారాయణం, తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వేద వ్యాస ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి పూజ కార్యక్రమాలు .... ఉదయం 8:30 లకు స్థాపిత దేవత ఆహ్వానం, మహావిద్యాపాయణం, చండీపారాయణం, సరస్వతీ హŸమం, తదితర పూజలను నిర్వహిస్తారు. -
అమ్మవారికి బంగారు జడ బహూకరణ
పాలకొల్లు:పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్తుడు బంగారు జడను విరాళంగా అందించారు. ఓదూరు గ్రామానికి చెందిన ఎంఎస్ జానకీరామరాజు దంపతులు శనివారం ఆలయానికి వచ్చి పార్వతీ అమ్మవారిని దర్శించుకుని ఈవో యర్రంశెట్టి భద్రాజీకి 68 గ్రాముల బంగారు జడను విరాళంగా అందజేశారు. ఈ బంగారు జడపై ముత్యాలు, ఎర్ర, పచ్చని రాళ్లను పొదిగారు. -
ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానానిక గురువారం సినీనటుడు ప్రభుదేవా విచ్చేశారు.ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. రూ.2500 టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.