
అమ్మవారికి బంగారు జడ బహూకరణ
పాలకొల్లు:పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఓ భక్తుడు బంగారు జడను విరాళంగా అందించారు. ఓదూరు గ్రామానికి చెందిన ఎంఎస్ జానకీరామరాజు దంపతులు శనివారం ఆలయానికి వచ్చి పార్వతీ అమ్మవారిని దర్శించుకుని ఈవో యర్రంశెట్టి భద్రాజీకి 68 గ్రాముల బంగారు జడను విరాళంగా అందజేశారు. ఈ బంగారు జడపై ముత్యాలు, ఎర్ర, పచ్చని రాళ్లను పొదిగారు.