ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు | dhana laxmi alankaranalo ammavaru | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు

Published Wed, Oct 5 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు

ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు

  • రామయ్యకు నిత్యకల్యాణం
  • భద్రాచలం : భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా  ఉదయం పంచామృతాలు,నదీ జలాలతో ఆలయ అర్చకులు అభిషేకంను నిర్వహించారు. వేదపండితులచే రామయాణ పారాయణం జరిగింది. మధ్యాహ్నం 3గం.లకు అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణచేసి, భక్తుల దర్శనార్ధం అమ్మవారి ఆలయంలో కొలువు తీర్చారు. గురువారం లక్ష్మీతాయారు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

    • రామయ్యకు ఘనంగా కల్యాణోత్సవం

    శ్రీసీతారామచంద్ర స్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్ధ జలాలను తీసుకుని వచ్చి బేడా మండపంలో స్వామి వారికి అభిషేకం చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.  అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను పంపిణీ చేశారు.



     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement