కరుణించమ్మా.. | ammavari festival | Sakshi
Sakshi News home page

కరుణించమ్మా..

Published Sun, Dec 18 2016 10:07 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

ammavari festival

వడ్డి పోలమాంబ, కుంచమాంబ జాతర మహోత్సవాలు రాజమహేంద్రవరం నగరంలో వైభవంగా జరుగుతున్నాయి. తాడితోట రెల్లిపేటలోని అమ్మవార్ల ఆలయాల వద్ద జరుగుతున్న ఈ ఉత్సవాలు ఆదివారం 18వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మరిడమ్మ తల్లి పిడతల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. రెల్లిపేట నుంచి బైపాస్‌ రోడ్డు, తాడితోట జంక్ష¯ŒS మీదుగా రామకృష్ణ థియేటర్‌ వీరభద్ర నగర్‌ వరకూ ఊరేగింపు సాగింది. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య, కార్యదర్శి ఇంటి వెంకట్‌ పాల్గొన్నారు. వచ్చే నెల పదో తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయి.
– తాడితోట (రాజమహేంద్రవరం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement