హంస వాహనంపై అమ్మవారు
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి గంటలకు హంస వాహనంపై శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.