రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ: శ్రావణమాసం చివరి శనివారం కావడంతో వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంత మాధవరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల దర్శనాలు, హుండీ లెక్కింపుతో రెండు గంటలు క్యూలైన్లను అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు.