కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
Published Wed, Jul 12 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
పాలకొల్లు సెంట్రల్ : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో పాలకొల్లు జట్లు, మిల్లు కార్మిక సంఘం 74వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ కార్మికుడికి భద్రత కల్పించాలి్సన బాధ్యత యాజమాన్యానికి , ప్రభుత్వానికి కూడా ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని ఆలోచిస్తుంటే.. కాలుష్యం పేరుతో వాటిని అడ్డుకోవడానికి కొందరు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్మికుడు లేకుండా యాజమాన్యం లేదు.. యాజమాన్యం లేకుండా కార్మికుడు లేడని చెప్పారు. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుచుకున్నప్పుడే సమస్యలు రావని సూచించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 4 లక్షల మంది కార్మికులు ఉండగా నేడు సుమారు 14 లక్షల మంది కార్మికులు ఈఎస్‌ఐ మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఇక నుంచి ఈఎస్‌ఐ సభ్యుడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి్సన అవసరం లేదని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అన్నారు. జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement