workers union
-
ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్
విశాఖపట్టణం: కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట 20 నిమిషాలు సీఎం జగన్ కార్మిక నాయకులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధానికి రాసిన లేఖతో పాటు విశాఖ ఉక్కు అవసరమైన గనులపై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో ఓఎన్ఎండీసీతో గనులతో జరిగిన ఒప్పందంపై పునఃసమీక్ష ఇస్తామని సీఎం చెప్పారు. పొస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. పోస్కో ప్రతినిధులు కలిశారని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించినట్లు తెలిపారు. కుదరకపోతే శ్రీకాకుళం జిల్లా భావనపాడు కృష్ణపట్నం పోస్టుల వద్ద ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని కార్మిక నాయకులతో సీఎం జగన్ తెలిపారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఇనుప ఖనిజం నిల్వలు లేవు, ఉన్నవి చాలా లోగ్రేడ్ గనులున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఒడిశాలో ఈ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. రుణాలను ఈక్విటీల రూపంలోకి మారిస్తే వడ్డీల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు తాము నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. పోస్కోవాళ్లు రాష్ట్రానికి రావడం వాస్తవం, నన్ను కలవడం వాస్తవమని, కడప, కృష్ణపట్నం, భావనపాడు చోట్ల ఫ్యాక్టరీ పెట్టమని వారిని కోరినట్లు సీఎం జగన్ వివరించారు. కార్మిక నాయకుల హర్షం సమావేశం అనంతరం కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో సీఎం జగన్ మాటలతో తమకు భరోసా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందన ఉద్యమానికి ఊపిరి పోసినట్టు అయ్యిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖతోపాటు విశాఖ ఉక్కుకు అవసరమైన గనులపై చర్చించినట్లు వివరించారు. విశాఖ ప్లాంట్‌పై ఇప్పటికే కేంద్రానికి లేఖలో సూచనలు చేసినట్లు తెలిపారు. తమ సమస్యలను సీఎం సానుకూలంగా విన్నారని కార్మిక నేతలు చెప్పారు. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉద్యమం చేయండి అని తమకు సీఎం సూచించినట్లు కార్మిక నాయకులు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా తీర్మానం చేస్తామని సీఎం చెప్పడం శుభపరిణామని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌తో సమావేశమైన వారిలో 14 మంది కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, సీహెచ్ నర్సింగ్ రావు, జేవీ సత్యనారాయణమూర్తి, వై.మస్తాన్ అప్ప, గంధం వెంకట్రావు, మురళీరాజు, జె.అయోధ్య రామ్, ఆదినారాయణ, కేఎస్ఎన్ రావు, బి.సురేశ్, కె.శ్రీనివాస్, బి.అప్పారావు, బి.పైడ్రాజు, వి.శ్రీనివాస్ ఉన్నారు. ఉన్నత జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యం : సీఎం జగన్ -
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
పాలకొల్లు సెంట్రల్ : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పాలకొల్లు జట్లు, మిల్లు కార్మిక సంఘం 74వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి పితాని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ కార్మికుడికి భద్రత కల్పించాలి్సన బాధ్యత యాజమాన్యానికి , ప్రభుత్వానికి కూడా ఉందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని ఆలోచిస్తుంటే.. కాలుష్యం పేరుతో వాటిని అడ్డుకోవడానికి కొందరు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కార్మికుడు లేకుండా యాజమాన్యం లేదు.. యాజమాన్యం లేకుండా కార్మికుడు లేడని చెప్పారు. ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నడుచుకున్నప్పుడే సమస్యలు రావని సూచించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 4 లక్షల మంది కార్మికులు ఉండగా నేడు సుమారు 14 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ మెంబర్లుగా ఉన్నారని తెలిపారు. ఇక నుంచి ఈఎస్ఐ సభ్యుడిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి్సన అవసరం లేదని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అన్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు అల్లు సత్యనారాయణ, బంగారు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
'బంద్‌ను విరమించుకోవాలి'
ఢిల్లీ: వచ్చే నెల 2న తలపెట్టిన బంద్‌ను కార్మిక సంఘాలు విరమించుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. కార్మిక సంఘాలు చేసిన 8 డిమాండ్లలో ఏడింటిని ఇప్పటికే నెరవేర్చామని ఆయన అన్నారు. మంగళవారం ఢిల్లీలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. దినసరి కూలీల వేతనాన్ని రూ. 350లకు పెంచినట్టు తెలిపారు. 2014-15 బోనస్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం సమ్మెకు దిగనున్నాయి. -
ఆర్టీసీకి మాయరోగం!
- నాలుగున్నర వేల మంది కార్మికులకు అనారోగ్యమట - ఆ పేరుతో మూకుమ్మడి సెలవులు - 19న కార్మిక సంఘం ఎన్నికలుండటంతో ప్రచారంలో కార్మికులు.. సెలవు కోసం ‘అనారోగ్యం’ పేరుతో డ్రామా - జబ్బు పడ్డట్టు ఆర్టీసీ ఆసుపత్రి నుంచే సర్టిఫికెట్లు - అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్న కార్మిక సంఘాల నేతలు.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు - రాష్ట్రవ్యాప్తంగా 15% వరకు నిలిచిపోయిన బస్సు సర్వీసులు - ఇబ్బందుల్లో ప్రయాణికులు.. ఆదాయం కోల్పోతున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి ఒక్కసారిగా జబ్బు చేసింది! ఎంతగా అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగున్నర వేల మంది కార్మికులు ‘సిక్’ అయ్యేంత!! తాము అనారోగ్యంతో బాధపడుతున్నందున విధులకు హాజరు కాలేమంటూ వారంతా డిపో మేనేజర్లకు లేఖలు పంపారు. వారు నిజంగానే అనారోగ్యానికి గురయ్యారంటూ హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉన్న డిస్పెన్సరీలు సర్టిఫై చేసేశాయ్. దీంతో డిపోల్లో ఒక్కసారిగా డ్రైవర్లు, కండక్టర్లకు కొరత వచ్చి పడింది. ఉన్న సిబ్బందితో డబుల్ డ్యూటీలు చేయించినా సరిపోక దాదాపు 15%బస్సులు డిపోల్లేనే ఉండిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక ఆర్టీసీకి ఆదాయం కూడా పడిపోయింది. ఇంతకూ అంతమంది కార్మికులు ఒక్కసారిగా ఎందుకు జబ్బు పడ్డారో తెలుసా? ఈ నెల 19న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలున్నాయి. వాటికి ప్రచారం చేయటం కోసం అన్ని యూనియన్ల నేతలు వారితో సెలవు పెట్టించారు. అదీ ఆర్టీసీకి పట్టుకున్న ‘మాయరోగం’ కథ! అనారోగ్యం లేకుండానే సర్టిఫికెట్లెలా? తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంఘాలు ప్రచారంలో మునిగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంయుక్తంగా గుర్తింపు పొందిన టీఎంయూ, ఈయూలు ఈసారి విడిగా పోటీచేస్తుండగా, చీలికతో రెండు వర్గాలుగా ఉన్న ఎన్ఎంయూ ఒక్కటిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మిక సంక్షేమ నిధులను ఆర్టీసీ వాడుకుని కార్మికులకు బకాయిపడింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతంలో ఎన్ఎంయూ కీలక నేతగా ఎదిగిన మహమూద్ అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఎటుమొగ్గుతారో తెలియని గందరగోళం నెలకొంది. దీంతో సంఘాలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇందుకు కార్మికుల అవసరం కావటంతో ఆయా సంఘాలు తమకు అనుకూలంగా ఉన్నవారిని గుర్తించి సెలవులు పెట్టించి ప్రచారంలోకి దింపాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యామంటూ లీవులు పెట్టారు. సంస్థ కార్మికులు అనారోగ్యానికి గురైతే ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారిస్తూ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. యూనియన్ నేతలు ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉండే కేం ద్రాలపై ఒత్తిడి తెచ్చి కార్మికులకు సిక్ సర్టిఫికెట్లు జారీ చేయిస్తున్నా రు. నాలుగైదు రోజుల్లో ఏకంగా 4500 మంది ఇలా ప్రచారం బాటపట్టారు. ఆగిపోయిన బస్సులు సాధారణంగా ప్రతి డిపోలో సిబ్బంది సెలవులు, ఇతర కారణాలతో నిత్యం ఐదారు బస్సులు నిలిచిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కో డిపోలో రోజూ 15 నుంచి 20 వరకు బస్సులు నిలిచిపోవాల్సి వస్తోంది. నగరంలోని ఓ డిపోలో గురువారం సాయంత్రానికి వంద మంది కార్మికులు సెలవులో వెళ్లిపోయారు. దీంతో గురువారం 30 మంది కార్మికులతో డబుల్ డ్యూటీ చేయించినా 15 బస్సులు ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా డిపోల్లో కూడా కాస్త అటూఇటూగా ఇదే పరిస్థితి నెలకొంది. అటు గ్రామాల్లో కూడా కొన్ని ఊళ్లకు బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సెలవు పెట్టే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది. చోద్యం చూస్తున్న యాజమాన్యం ఇలా ఎన్నికల వేళ ప్రచారం కోసం సెలవులు పెట్టడం కొత్తకాదు. గతంలో ఎన్నికల సమయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలా మూకుమ్మడి సెలవులు రాకుండా చూసేవారు. ముందుగానే తార్నాక ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు కార్మికులకు సర్టిఫికెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తే ఓ యూనియన్ నేత బస్‌భవన్‌కు వెళ్లి ఉన్నతాధికారి ఒకరితో ఆసుపత్రికి ఫోన్ చేయించి మరీ సర్టిఫికెట్లు ఇప్పించాడని ప్రచారం జరుగుతోంది. -
భారత్ బంద్ విజయవంతం
-
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కార్మిక సంఘాలు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి కార్మిక సంఘాలు సోమవారం సమ్మెనోటీసును ఇచ్చాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ఈ సమ్మె నోటీసులో పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 14 వేలు రూపాయలు ఉండాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. సమ్మెనోటిసులో జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భాగస్వాములైనారు. ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరిక జారీ చేశారు. -
కళ్లెదుటే కార్మిక ద్రోహం
వనం దుర్గాప్రసాద్, ఎలక్షన్ సెల్: ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ఆయన ఏలుబడిలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డ గడ్డు పరిస్థితులే శ్రామిక లోకానికి గుర్తుకొస్తున్నాయి. బాబు హయాంలో సంస్కరణల పేరు తో 87 ప్రభుత్వ రంగ సంస్థల నడ్డి విరిచారనేది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. 1994- 2004 మధ్యకాలంలో 22 సంస్థలను మూసి వేశారు. మరో 12 సంస్థలను పునర్వ్యవస్థీక రించారు. 11 సంస్థలను ప్రైవేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 54 సంస్థల తలరాతనే చంద్రబాబు మార్చేయడం అప్పట్లో విమర్శలకు కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థ ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది ఆరోపణ. రాష్ట్ర స్థాయి సంస్థలు, కో-ఆపరేటివ్ సంస్థల మార్కెట్ విలువ రూ.636 కోట్ల వర కూ ఉంటే కేవలం రూ.209 కోట్లకే అమ్మారనే దానికి బాబు వద్ద సరైన సమాధానం లేదు. ఏమిటీ దారుణం? చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ సజావుగా లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీశాయో, ఆ తర్వా త అవి టీడీపీ నాయకగణం చేతుల్లోకి వెళ్లాక ఎలా లాభాల బాట పట్టాయో విడ్డూరమే. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు ఇంటిదారి పట్టినా చంద్రబాబు సర్కారుకు పట్టలేదు. 2002లో హనుమాన్, ఏఎస్ఎం కో ఆప రేటివ్ షుగర్‌మిల్స్, డెల్టా పేపర్ మిల్స్‌ను కారు చౌకగా కట్టబెట్టడం, టీడీపీ ఎంపీ నామా నాగే శ్వరరావుకు పాలేరు షుగర్స్ ధారాదత్తం చేయ డం, బాబుకు సన్నిహితుడు మండవ ప్రభాకర్ రావుకు చెందిన ఎన్ఎస్ఎల్ గ్రూప్‌నకు షుగర్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లును రాసివ్వడం సభా సంఘాలనే విస్మయపరచింది. ఇదో పెద్ద దోపిడీ నిజాం షుగర్స్ బాబును ఇప్పటికీ వెంటాడే శాపమే. ఉద్దేశపూర్వకంగా ఈ పరిశ్రమ వెన్ను లో కత్తి దూసిన వైనాన్ని కార్మిక లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది. - షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులతో పాటు షక్కర్నగర్ డిస్టిలరీని విక్రయిం చిన వ్యవహారంలో ప్రభుత్వానికి 300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని శాసనసభా సంఘం అంచనా వేసింది. నిజాం షుగర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్ లో చంద్రబాబు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఉటంకించింది. వివిధ కార్పొరేషన్స్ ద్వారా నిజాం షుగర్స్ రుణాలు తీసుకుందని వెల్లడించింది. - నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. - తన హెరిటేజ్ కోసం వేలాది రైతులు, ఉద్యోగుల పొట్టగొట్టారనే ఆరోపణలకు చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. -
బస్సులు కొండెక్కవు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం తిరుమల శ్రీవారిని తాకింది. తిరుమలకు బస్సులు నడపడంపై టీటీడీ అధికారులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లా లో 1,350 బస్సు సర్వీసులు ఉన్నాయి. ఒక్క తిరుమలకు మా త్రమే 500 బస్సు సర్వీసులు రోజుకు 3,200 ట్రిప్పులు తిప్పుతున్నారు. జిల్లాకు రోజుకు రూ.1.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 13 రోజులుగా సాగుతున్న సమ్మెతో చిత్తూరు జిల్లాలో ఆర్టీసీకి సుమారు రూ.13 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు అంచనా. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెతో మరింత నష్టం వాటిల్లనుంది. 1975 ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించినపుడు మాత్రమే తిరుమలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. తర్వాత ఇంతవరకు బస్సుల రాకపోకలకు ఆటంకం కలగలేదు. ఇప్పుడు సమైక్య ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు బస్సులను నిలిపివేసినట్లు ఆర్టీసీ యూనియన్ ప్రకటించింది. ఈ సమ్మె ఢిల్లీని తాకాలి సమైక్యవాణి ఢిల్లీకి వినిపించాలంటే తిరుమలకు రాకపోకలను నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్ఎంయూ నాయకులు చల్లా చంద్రయ్య, ప్రభాకర్, బీఎస్‌బాబు, వైఎస్సార్ ఆర్టీసీ యూని యన్ నాయకులు పీసీ బాబు, లతారెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రకాష్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలోనే తిరుమలకు బస్సుల రాకపోకలను నిలిపివేసినట్లు వారు గుర్తుచేశారు. శ్రీవారి భక్తులకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించాలని కోరారు. సేవల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏపీఎస్ఆర్టీసీని విభజన పేరుతో రెండు గా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్థను, ఉద్యోగ, కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడి బస్సులు అక్కడే సీమాంధ్ర జిల్లాల్లో 14 వేల బస్సులను ఎక్కడికక్కడే ఆపేసినట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నుంచే దూర ప్రాంతాల బస్సులను నిలిపివేశారు. గ్రామాల్లో రాత్రిపూట ఉండే పల్లెవెలుగు బస్సులు కూడా అర్ధరాత్రి ఆయా డిపోలకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న ప్రయాణికులు కొందరు ముందే గమ్యస్థానాలకు చేరుకుంటే, మరి కొందరు రైళ్లు, ప్రైవేటు వాహనాల కోసం తంటాలు పడ్డారు.