'బంద్ను విరమించుకోవాలి' | Workers union should be call off bandh on sept 2, says Bandaru dattatreya | Sakshi
Sakshi News home page

'బంద్ను విరమించుకోవాలి'

Published Tue, Aug 30 2016 5:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

'బంద్ను విరమించుకోవాలి'

'బంద్ను విరమించుకోవాలి'

ఢిల్లీ: వచ్చే నెల 2న తలపెట్టిన బంద్ను కార్మిక సంఘాలు విరమించుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. కార్మిక సంఘాలు చేసిన 8 డిమాండ్లలో ఏడింటిని ఇప్పటికే నెరవేర్చామని ఆయన అన్నారు. మంగళవారం ఢిల్లీలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. దినసరి కూలీల వేతనాన్ని రూ. 350లకు పెంచినట్టు తెలిపారు. 2014-15 బోనస్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ చెప్పారు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఏడవ వేతన సంఘ సిపారసులను తమకు వర్తింపచేయాలని కనీసం వేతనం నెలకు రూ.18,000లకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో పాటు 12 డిమాండ్ల సాధనకు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగ్గనున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు శుక్రవారం సమ్మెకు దిగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement