minister pocharam srinivasareddy
-
పోచారంను పరామర్శించిన ఎంపీ కవిత
హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని నిజామాబాద్ ఎంపీ కవిత పరామర్శించారు. శనివారం ఆమె ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కొద్దిసేపు ఆయన కుటుంబ సభ్యులతో కవిత ముచ్చటించారు. -
మంత్రి పోచారం పర్యటన
నిజామాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు వేల్పూర్ మండలం జానకంపేటలో గోడౌన్ ప్రారంభోత్సవం, అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు అంక్సాపూర్, 11 గంటలకు మోర్తాడ్, 12 గంటలకు మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇదే గ్రామంలో రూ. 10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తారు. అనంతరం 2.30 గంటలకు బాల్కొండ మండలం సోన్పేట్లో రూ. 35 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. 3.30 గంటలకు పోచంపాడ్ ప్రాజెక్టు అధికారులతో కలిసి డ్యాం వద్ద మొక్కలు నాటుతారు. -
పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల పొట్ట నాదే, బట్ట నాదే అని అన్నారు. మనిషికి కావాల్సిన ఆహారం, బట్ట (పత్తి) వ్యవసాయం ద్వారానే సమకూరుతాయని చెప్పుకొచ్చారు. వాణిజ్య పన్నుల మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసిస్తే, వ్యవసాయ మంత్రిగా తాను రైతుల కోసం ఖర్చు చేస్తానని, తిరిగి పన్నుల రూపంలో వాణిజ్యశాఖకే జమ చేస్తామని అన్నారు.