పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం | minister pocharam told interesting words | Sakshi
Sakshi News home page

పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం

Published Thu, Oct 1 2015 8:44 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం - Sakshi

పొట్ట నాదే.. బట్టా నాదే: పోచారం

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల పొట్ట నాదే, బట్ట నాదే అని అన్నారు.

మనిషికి కావాల్సిన ఆహారం, బట్ట (పత్తి) వ్యవసాయం ద్వారానే సమకూరుతాయని చెప్పుకొచ్చారు. వాణిజ్య పన్నుల మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసిస్తే, వ్యవసాయ మంత్రిగా తాను రైతుల కోసం ఖర్చు చేస్తానని, తిరిగి పన్నుల రూపంలో వాణిజ్యశాఖకే జమ చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement