Minister of State for Agriculture
-
మోదీ అధ్యక్షతన భేటీ.. కేంద్రమంత్రికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అనూహ్యంగా అస్వస్థతకు గురయ్యారు. బీజేపీ పార్లమెంటరీ భేటీ జరుగుతుండగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి కృష్ణరాజ్ కూడా హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గత మూడు రోజులుగా జ్వరం రావడంతోపాటు ఆమెకు షుగర్ వ్యాధి కూడా ఉన్నందున ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు చెప్పారు. -
మత్స్యకారులను ఆదుకుంటాం
నిజాంసాగర్: ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల మత్స్య పరిశ్రమ, హార్టికల్చర్ శాఖలు కనుమరుగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రాంత పెత్తందార్ల వల్ల ఆ రెండు శాఖలు కళావిహీనంగా మారాయని ఆరోపించారు. మత్య్సశాఖతో పాటు హార్టికల్చర్ శాఖలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సోమవారం మండ లంలోని అచ్చంపేట మత్య్సబీజక్షేత్రాన్ని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు సందర్శిం చారు. చేప పిల్లల విత్తనోత్పతి లేక బోసిపోయిన నర్సరీలను చూసి మత్య్సశాఖ పని తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కార్మికుల సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఆంధ్రా వ్యాపారులు రోయ్యల పెంపకం చేపట్టడంతో చేప పిల్లలు ఉత్పత్తి తగ్గింద న్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి 1,680 కుటుంబాలు జీవ నం సాగిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులో చేపపిల్లల పెంపకానికి తగిన ప్రాధాన్యత కల్పించి మత్స్యకార్మిక కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏడాదికి 30 వేల కోట్ల వ్యాపారం మత్య్సపరిశ్రమను ప్రభుత్వం వ్యవసాయానికి అనుసంధానం చేసిందన్నారు. హైదరాబాద్‌లో 20 శాతం చేపల వ్యాపారం తెలంగాణ, 80 శాతం ఆంధ్రా వ్యాపారం సాగుతోందన్నారు. దీంతో ఏడాదికి * 30 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. మత్స్యపరిశ్రమను పురోగతి దిశగా తీసుకు వెళ్లేందుకు కోసం ఆగస్టు 2న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. హార్టికల్చర్ శాఖపై ఆగస్టు ఒకటిన హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి రైతు లకు హార్టికల్చర్ సామాగ్రిని సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 25 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అసరం ఉండగా, ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినయ్‌కుమార్, శ్రీహరి, ఎన్డీసీసీ బ్యాంకు డెరైక్టర్ నామాల శంకర్, మత్య్సశాఖ అధికారులు రాములు పాల్గొన్నారు. -
వ్యవ‘సాయం’ చేస్తాం
ఈ రంగానికే పెద్దపీట - ఆంక్షలు లేకుండా రుణమాఫీ - పతి ఎకరాకు నీరందిస్తాం - పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలి - వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి - అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుదాం : ఎంపీ బీబీపాటిల్ కలెక్టరేట్ : నవ తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయ, సంక్షే మ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో 85శాతం మంది ప్రజలు ఉన్నందున వీటిపైనే దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్‌లో గురువారం జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముందుగా తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 32లక్షల మంది రైతుల రూ.22వేల కోట్ల రుణాలను ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు. ఇందులో బంగా రం పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. జిల్లాలో రూ. 2,675కోట్ల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 650 కిలోమీటర్ల గోదావరి, 370 కిలో మీటర్ల కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున వీటిద్వారా లక్షల ఎకరాలకు నీరందించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. ఉద్యమనేత నుంచి ప్రభుత్వ రథసారధిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను, లక్ష్యాలను సంపూర్ణంగా నెరవేర్చడానికి అందరం ఐక్యమత్యంతో కృషి చేద్దామన్నారు. గుడ్గవర్నెన్స్తో ప్రజలకు మిత్రులుగా సేవలు అందించడానికి పార్టీలతో సంబంధం లేకుండా పని చే యాలని పోచారం సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పా రు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వసతిగృహాలను అధికారులు తనిఖీ చేయాలని, అవసరమైతే రాత్రిబస చేయాలన్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. జిల్లాను, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ డి. వెంకటేశ్వర్రావు, ఎస్పీ తరుణ్‌జోషి, జడ్పీ సీఈఓ రాజారాం, డీఆర్ఓ రాజశేఖర్, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా శనివారం చేవెళ్ల మండలంలోని చనువల్లి అనుబంధ గ్రామం ఇక్కారెడ్డిగూడలోని పాలీహౌస్ (గ్రీన్హౌస్)లను సందర్శించారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఆర్థికంగా ఆదాయం చేకూర్చే పంటలను పండించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. మేనిఫెస్టోలో హామీలు నెరవేరుస్తాం రుణమాఫీపై రైతుల ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ఉంటుందని తెలిపా రు. బ్యాంక్ అధికారులకు రైతుల వివరాలను ఇవ్వమని ప్రభుత్వం అడిగిందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో 44వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 13 నుంచి జిల్లాలవారీగా టార్గెట్లను ఇచ్చి పూర్తి చేయిస్తామన్నారు. గ్రీన్‌హౌస్‌లు రంగారెడ్డి జిల్లాలోనే 2013-14 సంవత్సరంలో 916మంది రైతులు 256 గ్రామాలలో వేసుకున్నారని వీటికి రూ.10కోట్ల 14లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలకు సంబందించి పూర్తి వివరాలలతో కూడిన ఓ బుక్‌లెట్‌ను తయారుచేసి అన్ని గ్రామపంచాయతీలకు అందిస్తామని పోచారం పేర్కొన్నారు. రైతులే విత్తనాలు తయారు చేసుకునేలా.. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అవసరమైన విత్తనాలను వారే తయారు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలా కాకుండా ఎక్కడైతే ఏయే పంటలు పండిస్తారో అక్కడే ఆయా విత్తనాలు తయారు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో మనకు అవ సరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్హౌస్ రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రీన్హౌస్లకు ఇచ్చే విద్యుత్‌ను కమర్షియల్ నుంచి తొలగించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, రీప్లాంటేషన్‌కు సహయం చేయాలని కోరారు. చేవెళ్ల ప్రాతంలో కూరగాయల రైతులకు ఎక్కువగా ఉన్నారని.. వారికి కోల్డ్ స్టోరేజి అవసరమని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మైక్రో ఇరిగేషన్ ఈడీ వెంకరాంరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు బాబు, ఉమాదేవి, సంజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు మానిక్యరెడ్డి, వసంతం,నర్సింలు, రైతులు పాల్గొన్నారు. రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తాం విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన వనరులు తెలంగాణలో ఉన్నప్పటికీ ఉత్పత్తి మాత్రం లేకపోవడం రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోనే మనకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇక్కడి వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసుకొని రైతులకు 24 గంటల కరెంటు అందించేందుకు కూడా అవకాశం ఉందన్నారు. ప్రసుత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు 8 గంటల కరెంటు అందిస్తామన్నారు.