the Ministry of Endowments
-
అర గంటలోనే దేవదేవుడి దర్శనం
• ఏటా 1.30 లక్షల మంది సామాన్యులకు ‘దివ్యదర్శనం’ • త్వరలో అమల్లోకి రానున్న కొత్త పథకం సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు కూడా మరింత సులువుగా లభించనుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ త్వరలో దివ్యదర్శనం పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భక్తుడు క్యూలైన్లోకి వెళ్లిన అరగంటలో దర్శనం పూర్తయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం కింద ఎంపికై తిరుమలకు చేరుకునేవారికి టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి దర్శనం చేయిస్తారు. దర్శనం అనంతరం డిప్యూటీ ఈవో స్థాయి అధికారి చేతులు మీదుగా ఉచితంగా దేవుడి ప్రసాదం అందజేస్తారు. వీఐపీలకు మాత్రమే దక్కే సౌకర్యాలను దివ్యదర్శనం పథకం కింద సామాన్య భక్తులకు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల సమీకరణ, భక్తులకు రాయితీతో కూడిన రవాణా సౌకర్యం తదితర అంశాలపై దేవాదాయ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏటా 1.30లక్షల మందికి స్వామివారి దివ్య దర్శనం ఉచితంగా లభించనుంది. -
బోరంచ నల్లపోచమ్మ ఆలయ కమిటీపై నేతల కన్ను
బోరంచ నల్లపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై నేతల కన్ను -త్వరలో కొలువుదీరనున్న కొత్త కమిటీ -భారీగా ఉన్న ఆశావహుల సంఖ్య -పావులు కదుపుతున్న స్థానిక అధికార పార్టీ నేతలు మనూరు : బోరంచ నల్లపోచమ్మ ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ పదవిపై పలువురి నేతల కన్ను పడింది. దీంతో ఆ పదవి చేపట్టేందుకు రోజురోజుకు ఆశవాహుల సంఖ్య పెరుగుతోంది. నల్లపోచమ్మ ఆలయం మూడేళ్ల క్రితం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఇన్నాళ్లు ఆలయ నిర్వాహణ వ్యవహారం సంబంధిత అధికారులే చూసుకుంటున్నారు. కేతకి సంగమేశ్వర ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి నల్లపోచమ్మ ఆలయ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. గత కొద్దిరోజులగా వేద పండితులను నియమించడంతో అమ్మవారి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అంతకు ముందు స్థానిక బైండ్ల, అవుటి కులస్తులు పూజలు నిర్వహించేవారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలోనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి ఆలయ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న ఆదాయం.. ఇటీవల గత కొంతకాలంగా బోరంచ నల్లపోచమ్మ ఆలయానికి భారీ ఆదాయం వస్తోందని స్థానికులు అంటున్నారు. ఏడాదికి రెండుమార్లు నిర్వహిస్తున్న హుండీ లెక్కింపు ద్వారా ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.15లక్షలకు పైగా ఆదాయం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో పాలక మండలి పదవికోసం ఎమ్మెల్యేవద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. -
ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోంది
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం విమర్శించారు. హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి భూములు తిరిగి వేలం వేయడానికి సిద్దంగా ఉందంటూ దేవాదాయ శాఖ ప్రకటించడంపై మండి పడ్డారు. సదావర్తి భూములవేలంలో ప్రభుత్వ తన పొరపాట్లను తప్పించుకునేందుకు కొత్త తప్పులు చేస్తోందని అన్నారు. పిఎల్ ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోట్ చేసిన 28 కోట్లను బేస్ ప్రైజ్ గా నిర్ణయించి టెండర్ నిర్వహిస్తామనటం దారుణమన్నారు. ముందు వేలాన్ని పూర్తిగా రద్దు చేసి.. కొత్త వేలాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ - బీజేపీల దొంగాటను బయట పెడతాం.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10ఏళ్లు అమలు చేస్తామని మానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని.. వీటిని బయట పెట్టేందుకు ఆగస్టు 1న విజయవాడలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.