ఓబీసీలకు ప్రత్యేకశాఖ ప్రతిపాదన లేదు
* దేవేందర్‌గౌడ్‌కు కేంద్రమంత్రి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, ఓబీసీలకు ప్రత్యేక విభాగం ఏదీ లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక శాఖమంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గత పార్లమెంట్ సమావేశాల సం దర్భంగా టీడీపీ ఎంపీ టి దేవేందర్‌గౌడ్ స్పెషల్ మెన్షన్ కింద ఓబీసీలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానాలు పంపించారు.
సామాజిక ఆర్థిక కుల గణనకు సంబంధించిన వివరాలు కేంద్ర హోంశాఖకు చెందిన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) నుంచి రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీ, జార్ఖండ్ మినహా అన్ని రాష్ట్రాల సమాచార ధృవీకరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓబీసీల ఉపవర్గీకరణ విషయంలో సూ చ నలు, సలహాలు ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) అన్నిరాష్ట్రాలను కోరినట్టు తెలిపారు. ఎన్సీబీసీ రాజ్యాంగ హోదాకల్పన ప్ర తి పాదన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.