minority voters
-
గెలుపు ఓటములపై ప్రభావం.. అక్కడ మైనారీటీలు ఏ పార్టీ వైపు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ బీజేపీకి ఊపునిచ్చింది. ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ప్రభంజనంలా తరలివచ్చిన జనంతో జైత్రయాత్రను మరిపించింది. కానీ బీజేపీని ఓడించడానికి ముస్లింలు, మైనారీటీలు ఏకం అవుతున్నారా.? కారు పార్టీకి మైనారీటీలు మళ్లీ అండగా నిలబడుతారా? లేదంటే కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారా? ఓట్ల చీలిక మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఓటమి నుండి గట్టేక్కిస్తుందా? అసలు మైనారీటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మైనారీటీ ఓట్ల భయంపై స్పెషల్ స్టోరీ. నిర్మల్ నియోజక వర్గంలో ఎన్నికల పోరు ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచడి శ్రీహరిరావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్నికలలో గెలవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ముగ్గురు హేమాహేమీలు నువ్వా.. నేనా రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో నిర్వహించిన సభకు ప్రదాని నరేంద్ర మోదీ హజరయ్యారు. మోదీ సభ. సూపర్ సక్సైసైంది. ఈ సభతో విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. కానీ ముస్లిం మైనారిటీల ఓట్లు దడ పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ముప్పై అయిదు వేల నుంచి నలబై వేల వరకు ముస్లిం మైనారీటీల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ ఓట్లను దక్కించుకోవడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్‌రావే కారణం గత అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలు బడార్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈసారి ముస్లింలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూపుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు ఒకరికంటే ఒకరు ప్రజల మద్దతు కూడగట్టడానికి పోటీ పడుతున్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదంటే బీఆర్ఎస్ వైపు వెళ్తారనేది ఉత్కంఠను రేపుతుందట. బీజేపీని ఓడించడానికి ఒకవేళ గెలిచే కాంగ్రెస్ వైపు వెళతారు. అదేవిధంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు ఉంటే కారు పార్టీ వైపు ఓట్లు వేసే అవకాశం ఉంది. బీజేపీని ఓడించటమే ముస్లిం లక్ష్యం. ఆరునూరైనా బీజేపీ విజయం సాదించవద్దని ముస్లింలు బావిస్తున్నారట. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ముస్లిం ఓట్ల చీలిక ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇది తనకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి స్వర్ణ రెడ్డికి 16,900 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే 70,714 ఓట్లు వచ్చాయి. ఈ. ఎన్నికలలో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన చేరికతో నియోజకవర్గంలో బీజేపీకి ఊపు, ఉత్సాహం వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికలలో కూడా నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ వైపు ప్రజలు భారీగా మొగ్గు చూపారు. ఎంపీగా సోయంబాపురావు మెజారిటీ విజయం సాదించారు. పార్లమెంటు ఎన్నికల ఊపు మళ్లీ ఉంటుందని తన విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి బావిస్తున్నారట. బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో తన విజయానికి ఎదురులేదని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారట. కానీ బీజేపీ విజయాన్ని అడ్డుకోవడానికి మైనారిటీలు ఏకం అవుతున్నారట. మహేశ్వర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మైనారిటీలు ఎత్తగడలు వేస్తున్నారట. ఓట్ల చీలిక నివారించి గెలిచే కారు, కాంగ్రెస్ ఓట్లు వేయాలని ముస్లింలు భావిస్తున్నారట.ఇప్పటికే నిర్మల్‌లో ఎంఐఎం మంత్రికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి కూడ ముస్లింల మద్దతు కూడగడుతున్నారట. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలని మైనారిటీలను మంత్రి కోరుతున్నారట. మైనారీటీలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం ఉంది. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తే మంత్రి విజయం ఖాయమని తెలిందట. మైనారీటీలు ఎకంగా మహేశ్వర్ రెడ్డికి దడ పుట్టిస్తోందట. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ఓట్ల చీలికతో గట్టేక్కాలనుకున్నా ఆశలు అవిరవుతున్నాయట. విజయంపై ఆశలు సన్నగిల్లుతున్నాయట. అయితే ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల మాదిరిగా ఈసారి విజయం ఖాయమని బావిస్తున్నారట. ముస్లిం మైనారీటలు ఎకమైనా, ఎంతమంది తన విజయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నినా తన విజయాన్ని ఏవరు అపలేరంటున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు సర్కారు వ్యతిరేకత, మైనారిటీ ఓట్లతో కూచడి ధీమాతో ఉన్నారట. ఈ ముగ్గురిలో ఏవరు విజయం సాధిస్తారో చూడాలి -
మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (పాతబస్తీ మినహా) గెలుపోటములపై ప్రభావితం చూపించే మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గతంలో సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు చాలా మంది బీఆర్ఎస్ వైపు మళ్లిన నేపథ్యంలో వారిని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై టీపీసీసీ ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించగా, పూర్తిస్థాయి వివరాలను పంపాలని అధిష్టానం కోరినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలా? మరేదైనా రూపంలో కార్యక్రమాన్ని చేపట్టాలా అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆ రెండు పార్టీలూ ఒకటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముస్లింలతో పాటు ఇతర మైనార్టీ వర్గాల ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్టు పలు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గతంలో ఎంఐఎంతో పాటు కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఈ వర్గాలు చాలా వరకు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ వైపు మళ్లినట్టు అర్థమవుతోంది. గత పదేళ్లుగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉండడంతో మైనార్టీ వర్గాలు పార్టీ నుంచి కొంత దూరమయ్యాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మైనార్టీలకు సంబంధించిన రెండు ప్రధాన డిమాండ్లతో ఆ వర్గాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పన, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం రుణాల మంజూరు అనే అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లనుంది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీగా, దేశ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ వైపు మైనార్టీలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు అంతర్గతంగా ఒక పార్టీకి మరోపార్టీ సహకరించుకుంటున్నాయనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆ వర్గాలను ఆకర్షించాలనేది కాంగ్రెస్ పార్టీ యోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మైనార్టీల పక్షాన యాత్ర లేదంటే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని, జనవరి 26 నుంచి జరగనున్న హాత్‌సే హాత్ జోడో కార్యక్రమం సమయంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌కు ‘మైనారిటీ’ బెంగ!
అహ్మదాబాద్: గుజరాత్లో కీలకమైన మైనారిటీల ఓట్లను ఒడిసిపట్టేందుకు బీజేపీ మినహా పార్టీలన్నీ ఈసారి సర్వ శక్తియుక్తులూ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాళ్ల ఓట్లను గంపగుత్తగా పొందుతూ వచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ రూపంలో సెగ తగులుతోంది. కొత్తగా రాష్ట్ర బరిలో దిగిన ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఈ రెండు పార్టీల రాకతో ఓటర్లకు కూడా చాయిస్ పెరిగిపోయడం ఆసక్తికరంగా మారింది...! 6.5 కోట్ల గుజరాత్ జనాభాలో ముస్లింలు దాదాపు 11 శాతం దాకా ఉంటారు. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యముంది. జమ్లాపూర్–ఖడియా అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఏకంగా 65 శాతమున్నారు. మిగతా చోట్ల అంతగా కాకున్నా వీరి ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి! రాష్ట్ర ముస్లింలు పాలక బీజేపీకి ఎప్పుడూ పెద్దగా ఓటేసింది లేదు. అందుకు తగ్గట్టే గత రెండు దశాబ్దాల పై చిలుకు కాలంలో ముస్లింలకు బీజేపీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలకు టికెట్లివ్వగా కేవలం ముగ్గురే నెగ్గారు. 2012లో ఏడుగురికి టికెట్లిస్తే ఇద్దరే గెలిచారు! ఈసారి తన ముస్లిం ఓటు బ్యాంకుకు ఆప్, మజ్లిస్ గండి కొట్టేలా కన్పిస్తుండటంతో దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పలు చర్యలు చేపట్టింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే మొహమ్మద్ పిర్జాదాను నియమించింది. దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కుండాలంటూ అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మైనారిటీల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడేనంటూ ఇతర పార్టీలు ఎంతగా విమర్శించినా లెక్క చేయడం లేదు. కేజ్రీవాల్, అసద్ పర్యటనలు మరోవైపు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈసారి 30 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ ఇప్పటికే పేర్కొంది. ఆరు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్, మజ్లిస్‌లకు భిన్నంగా ఆప్ మాత్రం మైనారిటీల్లోకి చొచ్చుకుపోయేందుకు నిశ్శబ్దంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ముస్లింలకు టికెట్లిచ్చింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ పాలనలోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తరచూ పర్యటిస్తూ వారి నమ్మకాన్ని చూరగొనేందుకు శ్రమిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర మైనారిటీలకు మంచి శకునాలేనంటున్నారు మైనారిటీ కో ఆర్డినేషన్ కమిటీ అనే ముస్లిం స్వచ్చంద సంస్థ కన్వీనర్ ముజాహిద్ నఫీస్. ‘‘గత ఎన్నికల దాకా గుజరాత్ ముస్లింలకు కాంగ్రెస్ మినహా పెద్దగా చాయిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడలా లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మజ్లిస్, ఆప్‌లను ముస్లిం ఓటర్లు పెద్దగా పట్టించుకోరని, ఎప్పట్లాగే కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తారని ఆ పార్టీకి చెందిన దరియాపూర్ ఎమ్మెల్యే గయాజుద్దీన్ షేక్ ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని మించిన హిందూత్వవాదినని పదేపదే రుజువు చేసుకుంటున్నారు. కనుక ముస్లింలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. మజ్లిస్‌కు రాష్ట్రంలో పెద్దగా ఆదరణే లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆప్ నేతలు మాత్రం ఢిల్లీ, పంజాబ్ ప్రదర్శనను గుజరాత్లో పునరావృతం చేస్తామని, మైనారిటీలు కూడా తమనే నమ్ముతున్నారని చెబుతున్నారు. -
దొంగల రాజ్యానికి రాజులు
పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను ఉద్దేశిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్దిఖీ ఇటీవల ఐఎస్ఎఫ్ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అమలును తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు. -
మైనార్టీ ఇక్కడ మెజార్టీ
ఉద్యమ గుమ్మం ఖమ్మం నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. రాజకీయ దిగ్గజాలైన తుమ్మల నాగేశ్వరరావు, కుమారున్ని బరిలో దింపిన పువ్వాడ నాగేశ్వరరావులు కూడా ఓటరు నాడి తెలుకునేందుకు చెమటోడ్చాల్సి వస్తోంది. ఊహకందని విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చేలా ఉండటంతో నేతలు తలపట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో వాటిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీతో జట్టుకట్టి టీడీపీ, యూనిస్సుల్తాన్కు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఆ వర్గం ఓట్లకు దూరమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలకు ఈ ఓట్లు పడవచ్చనే అంచనాలు ఊపందుకున్నాయి. వైఎస్ఆర్ కల్పించిన నాలుగుశాతం రిజర్వేషన్ తమకు లాభిస్తుందని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇంతకూ మైనార్టీల మనసులను ఎవరు దోచుకుంటారో వేచిచూడాల్సిందే.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో వారి ఓట్లే కీలకం టీడీపీ, కాంగ్రెస్‌లపై మైనార్టీల ఆగ్రహం ప్రత్యామ్నాయం వైపు చూపు మైనార్టీలకు దగ్గరవుతున్న వైఎస్సార్సీపీ ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మైనార్టీ ఓటర్ల నిర్ణయమే జిల్లాలో కీలకం కానుంది. ఖమ్మం, రఘునాథపాలెం మండలం కలిపి ఏర్పడిన నియోజకవర్గంలో 250 పోలింగ్స్టేషన్ల పరిధిలో మొత్తం 2,64,007 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పుురుషులు 1,33,793, మహిళలు 1.30,214, ఇతరులు 37 మంది ఉన్నారు. ఖమ్మం నగరంలో ఖిల్లా, శుక్రవారిపేట, మోమినాన్, ముస్తఫానగర్, నిజాంపేట, తుమ్మలగడ్డ, చెరువుబజార్, ఇస్లాంపేట, మోతీనగర్లతో పాటు పరిసర ప్రాంతంలో ఉన్న ఇందిరానగర్, గొల్లగూడెం, పాండురంగాపురం ప్రాంతాల్లో మైనార్టీలు అధికంగా ఉన్నారు. కొత్త ఓటర్లను కూడా కలిపితే మైనార్టీలు, నూర్బాష్లు మొత్తం 50 వేల ఓటర్ల వరకు ఉంటారని అంచనా. అంటే మొత్తం ఓటర్లలో ఐదో వంతు మైనార్టీలే ఉన్నారన్నమాట. పార్టీల వారిగా గిరిగీసుకొని ఉండే మైనార్టీ ఓటర్లు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీడీపీ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఒక్కసారి కూడా మైనార్టీ నాయకులను బరిలో దింపలేదు. పార్టీ పుట్టిన నాటి నుంచి పనిచేస్తున్న వారిని కరివేపాకులా వాడుకున్నారే తప్ప వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మూడు జనరల్ స్థానాల్లో ఒక్కటైనా తమకు కేటాయించాలని మైనార్టీ నాయకులు కోరారు. టికెట్ వస్తుందని ఆశించి నామినేషన్లు కూడా వేశారు. కానీ చివరకు చేదు అనుభవమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకోవడం మైనార్టీలకు రుచించడంలేదు. టీడీపీకి ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపిన వారం అవుతామని పలువురు మైనార్టీ పెద్దలు టీడీపీకి ఓటు వేయవద్దని తీర్మానం చేసినట్లు ప్రచారం. కాంగ్రెస్ విషయానికొస్తే మైనార్టీ నాయకులంటే కాంగ్రెస్ పార్టీలో చులకన భావం ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం టికెట్ ఆశించిన సుల్తాన్‌కు భంగపాటు ఎదురు కావడంతో పాటు కనీసం పార్టీ జిలా ్లసమన్వయ కమిటీలో కూడా మైనార్టీలకు స్థానం కల్పించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీలు మండిపడుతున్నారని సమాచారం. ప్రాధాన్యత ఇవ్వని పార్టీకి ఓటేసి గెలిపించడం కంటే వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించి తమ సత్తా చూపించాలని పలువురు మైనార్టీ నాయకులు బహిరంగంగానే అంటుండటం గమనార్హం. మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలు మర్చిపోలేనిది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన మహానేత వైఎస్ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మైనార్టీల అవసరాలను గుర్తించి ఇతర వర్గాలకు మాదిరిగానే సంక్షేమ పథకాలు అందించారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం ఆవిర్భవించిన వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కూరాలకుల నాగభూషణం ప్రచారంలోనూ మైనార్టీలు ముందుడటాన్ని దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలపై కోపంతో ఉన్న నాయకులు వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారని సమాచారం. తెలంగాణవాదంతో ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్కు మైనార్టీల ఓట్లు ఏ మేరకు పడుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ బహిరంగ సభకు మైనార్టీలు తరలిరావడం, కేసీఆర్ మైనార్టీలనుద్దేశించి ఉర్దూలో ప్రసంగించడం ఆ పార్టీ అభ్యర్థులకు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
ఆదోని, న్యూస్‌లైన్ : బీజేపీతో టీడీపీ జట్టు కట్టడంతో తెలుగుతమ్ముళ్లపై ఆ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో ఆదివారం ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదోని డివిజన్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడం.. ఈ రెండు పార్టీల తీరుపై మైనార్టీ ఓటర్లు భగ్గుమంటుండటంతో టీడీపీ శ్రేణులు డీలాపడ్డాయి. ఇదే సమయంలో మున్సిపల్, తొలి విడత ప్రాదేశిక పోరు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండటం టీడీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నాయి. డివిజన్లో మొత్తం 17 మండలాలు ఉండగా.. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, గుమ్మనూరు జయరాం, వై.బాలనాగిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు.. అభివృద్ధితో పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది. ఆదోనిలో వై.సాయిప్రసాద్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్‌లు సోమవారం ఉదయం కడితోట, జి.హొసళ్లి, ఇస్వి గ్రామాల్లో.. సాయంత్రం బసాపురంలో ప్రచారం చేపట్టగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాంలు ఎమ్మెల్యే నీరజారెడ్డి స్వగ్రామం తెర్నేకల్లులో ప్రచారం చేపట్టగా విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో బరిలో నిలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపును భుజానికెత్తుకున్న మంత్రాలయం నియోజకవర్గ సమన్వయకర్త సొంత మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీతో టీడీపీ దోస్తీ చేయడం.. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఈ పార్టీల నాయకులు ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతున్నారు. నాయకుల మాటకు కట్టుబడి పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఇప్పుడు వారే ముఖం చాటేస్తుండటంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలాఉండగా రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీ పోటీలో నామమాత్రమని ఇప్పటికే తేలిపోయింది. ఏదేమైనా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతోంది.