minoritys
-
రగులుతున్న ఫ్రాన్స్
-
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
మైనార్టీ ‘కృష్ణుడు’
ఇచ్చోడ (ఆదిలాబాద్): మండలకేంద్రంలో ఫస్ట్‌స్టెఫ్ స్కూల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంశాదభాను అనే మైనార్టీ మహిళా తన కుమారుడిని చిన్నికృష్ణుడు వేషధారణ వేయించి ఆకట్టుకుంది. పాఠశాలలో జరిగే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసముండే శంశాద భాను, లతీఫ్‌ల దంపతుల కుమారుడు హయాన్ ఫస్ట్‌స్టెఫ్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని శంశాదభానును కొనియాడారు. ఎవరి మతవిధానం వారిది అని ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడంతోనే నిజమైన భారతీయత అని శంశాదభాను చెప్పడం మత్యసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. -
మైనారిటీలకు 60 కొత్త స్కూళ్లు
► జూన్ నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశం ►తొలుత 5, 6, 7 తరగతుల్లో ప్రవేశాలు ►క్రమంగా 12వ తరగతి వరకు స్థాయి పెంపు ►ఇంగ్లిష్‌లో విద్యాబోధన.. పోస్టుల భర్తీకి ► డీఎస్సీతో పాటు నోటిఫికేషన్ ►నిర్వహణ బాధ్యతలు విద్యాశాఖకు అప్పగింత ►అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ► చంచల్‌గూడ జైలు, రేస్‌కోర్స్‌లను తరలించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం (2016 జూన్) నుంచి 60 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీటిలో 30 పాఠశాలలు బాలికలకు, మరో 30 బాలురకు కేటాయించాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా నడిచే ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ స్వీకరించాలని సూచించారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలని, మొదటి ఏడాది 5, 6, 7 తరగతులలో ప్రవేశాలు కల్పించి.. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యాబోధన జరపాలని సీఎం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే జూన్‌లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం కావాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మైనారిటీ సంక్షేమం, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించే చర్యలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటే రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదటి ఏడాది కిరాయి భవనాల్లో పాఠశాలలు నడపాలని 2017 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలని, అందుకోసం అనువైన స్థలాలను గుర్తించాలని చెప్పారు. వక్ఫ్ బోర్డు స్థలాలను వినియోగించుకోవచ్చన్నారు. ఒక్కో భవనాన్ని రూ.20 కోట్లతో కనీసం ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామని అన్నారు. ఈ బడ్జెట్లోనే రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు కేటాయిస్తామన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందున కార్యక్రమాలు వేగంగా అమలయ్యేందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తే వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీ ఉల్లా, మైనారిటీ సంక్షేమ శాఖ డెరైక్టర్ అక్బర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలింపు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రేస్ కోర్‌్రను కూడా నగర శివార్లకు తరలించాలన్నారు. ఈ రెండు స్థలాలను రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పారు.