misbehaves with girls
-
యల్లనూరులో కీచక టీచర్
యల్లనూరు: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపుతుంటారు. అలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేరి్పంచి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ కట్టుతప్పాడు. అభం శుభం తెలియని విద్యార్థినులను వేధిస్తూ పైశాచికానందం పొందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకు సంబంధించిన వివరాలిలా.. మండలంలోని చిలమకూరు మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఉపాధ్యాయుడిగా భాస్కర్‌నాయక్ పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతను 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాకకూడని చోట తాకుతూ వికృతానందం పొందుతున్నాడు. ఈ క్రమంలో విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆగ్రహం చెందిన వారు.. వారం క్రితం పాఠశాలకు చేరుకుని ఎంఈఓ చంద్రశేఖర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్‌ను నిలదీశారు. అయితే, విషయం బయటకు తెలియకుండా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు భాస్కర్నాయక్పై డీఈఓ వరలక్ష్మి, మోడల్ స్కూల్ ఏడీ నాగరాజు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి విధులకు రావొద్దని ఆదేశించారు. వేరే చోటుకు బదిలీ చేసుకోవాలని తెలియజేసినట్లు సమాచారం. అయితే, భాస్కర్‌నాయక్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యారి్థనుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ మహేష్‌ను సంప్రదించగా, వారం రోజుల క్రితం ఘటన జరిగినట్లు తెలిపారు. అప్పటి నుంచి భాస్కర్ నాయక్‌ను విధులకు రానివ్వలేదని చెప్పారు. -
జనసేన నేత రాఘవరావు వికృత చేష్టలు
-
లిఫ్ట్‌లో బాలిక పట్ల బాలుడి అసభ్య ప్రవర్తన
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): సినిమా హీరోలా తాను కూడా ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనుకున్న ఓ బాలుడు లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మైనర్ బాలుడిని విచారించగా తాను కొన్ని సినిమాలను చూశానని, ఓ హీరో ఆ సినిమాలో హీరోయిన్ను ముద్దు పెట్టుకునే సీన్ తనకు బాగా నచ్చిందని, తనలా నేను కూడా ఎప్పటికైనా చేయాలనే ఆలోచనతో ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని వెంకటగిరి సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్ కుమారుడు(14) అదే అపార్ట్మెంట్లోని 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారంటూ మంగళవారం సాయంత్రం బాలికను లిఫ్ట్‌లోకి రప్పించి ముద్దు పెట్టుకున్నాడు. లిఫ్ట్ ఆరో అంతస్తుకు వెళ్లే వరకు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వద్ద ఉన్న ఫోన్‌తో బాధిత బాలిక తల్లికి ఫోన్ చేసింది. అప్రమత్తమైన తల్లి అక్కడికి చేరుకొని తన కూతురిని ఇంటికి తీసుకెళ్లింది. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలుడిని ఐపీసీ సెక్షన్ 354, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు -
పీఈటీ పాడుబుద్ధి.. !
సాక్షి, రాయదుర్గం : విద్యార్థినుల పట్ల అసభ్యకర, వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడి(పీఈటీ)కి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒప్పంద వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇలాహి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి మంగళవారం పాఠశాల వద్దకు చేరుకున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌వారిస్ వారిని వారించి.. మాట్లాడదాం అని చెప్పి.. వ్యాయామ ఉపాధ్యాయుడిని అక్కడి నుంచి తప్పించారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక శిక్షణ పేరుతో వెకిలిచేష్టలు పీఈటీ ఇలాహి ఇంగ్లిష్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తానని ప్రతి శుక్రవారం ఎనిమిదో తరగతి విద్యార్థినులను రప్పించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ పిల్లలు సోమవారం రాత్రి తమకు తెలిపారని పలువురు తల్లిదండ్రులు చెప్పారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల గురించి పిల్లలు చెబుతుంటే తట్టుకోలేకపోయామన్నారు. ఈ ఘటనపై ప్రశ్నించేందుకు వస్తే తమను చూసి తప్పించుకునేయత్నం చేసిన ఇలాహిని పట్టుకున్నామన్నారు. బాధిత విద్యార్థినులకు భరోసాగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్‌వారిస్ అసభ్యరంగా ప్రవర్తించిన పీఈటీని తప్పించి, వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం ఈ ఘటనపై మండల విద్యాధికారి నాగమణితో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కఠినంగా శిక్షించాలి పీఈటీ ఇలాహిని వెంటనే విధుల నుంచి తొలగించాలని వివిధ పాఠశాలల విద్యార్థినులతో కలిసి ఏఐఎస్ఎఫ్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన పీఈటీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం అందజేశారు. పీఈటీపై చర్యలు తీసుకోవాలి ఉర్దూ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, న్యాయవాది అయిన జింకా వసుంధర డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి కీచకులు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. -
బాలికపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
తూర్పుగోదావరి, కిర్లంపూడి (జగ్గంపేట): పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన ప్రజలు ఆ పాఠశాలకు చేరుకుని, కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆందోళన నిర్వహించారు. కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురం ఎంపీపీ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు తాటికొండ గణేశ్వరరావు ఆరో తరగతి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంటూ, ఆ బాలిక తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు ఆందోళన చేశారు. పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. నిందితుడైన ఉపాధ్యాయుడు పరారవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు అడపా సత్యనారాయణను పాఠశాలలో నిర్బంధించారు. గతంలో రెండుమూడుసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినా ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని, ప్రధానోపాధ్యాయుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ టి.జోసెఫ్, ఎస్సై జి.నరేష్‌లు ఎస్.తిమ్మాపురం పాఠశాలకు చేరుకుని విషయాన్ని ఆరా తీశారు. బాధిత బాలిక నుంచి, ఆమె తల్లిదండ్రుల నుంచి ఎంఈఓ రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. కీచక ఉపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారికి సిఫారసు చేయనున్నామని తెలిపారు. ఆందోళనలో గ్రామస్తులు గొల్లపల్లి చక్రధర్, బొజ్జపు శ్రీను, ఎం.బాబ్జీ, విద్యాకమిటీ చైర్మన్ గొల్లపల్లి ప్రసాద్, గొల్లపల్లి సత్యనారాయణ, సోము నారాయణరావు, దాసు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో పార్క్‌కు తీసుకెళ్లి..
అమీర్‌పేట : ప్రేమ పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు నెల్లూరు ప్రాంతానికి చెందిన యువతి ఉద్యోగం కోసం గత ఏడాది నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లో ఉంటోంది. ఆమెకు తన స్నేహితురాలి ద్వారా కూకట్‌పల్లిలో ఉంటున్న కృష్ణాజిల్లా నివాసి సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. తనకు తెలిసిన సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఈ నెల 20న కృష్ణ కాంత్ పార్క్‌కు తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ పోకిరి పోలీస్ ఎవడు?
నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలో మునిగిపోయిన అమ్మాయిలు, మహిళలను అసభ్యకరంగా తాకుతూ పైశాచికానందం పొందిన పోకిరి పోలీస్ కోసం వేట మొదలైంది. అహ్మదాబాద్ నగరంలోని ప్రసిద్ధ కాకరియా చెరువు వద్ద ఏటా డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే కాంకరియా కార్నివాల్ వేడుకల్లో బందోబస్తు కోసం వచ్చిన ఓ పోలీసు చేసిన నిర్వాకం తాలూకు వీడియో సోషల్ నెట్‌వర్క్‌లో హల్చల్ చేస్తోంది. కానిస్టేబుల్ ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో ఆ పోకిరీ పోలీస్ ఎవరో కనిపెట్టేందుకు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కార్నివాల్ లో బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తనకు ఎదురుగా వచ్చిన మహిళలనేకాక, పక్కనుంచే వెళ్లే అమ్మాయిలను అసభ్యకరంగా తాకాడు. ఈ తతంగమంతటినీ పోలీస్ వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. వెనుక నుంచి చిత్రీకరించడంతో ఆ పోకిరి పోలీస్ ముఖం వీడియోలో రికార్డ్ కాలేదు. దీంతో డిసెంబర్ 31న కాకరియా ప్రాంతంలో బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులు అందరినీ పిలిపించి విచారిస్తామని, దోషిగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామని మణినగర్ ఇన్స్పెకర్ ఎన్ఎస్ దేశాయ్ తెలిపారు.