'చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయండి'
హైదరాబాద్: మిషన్ కాకతీయ పనుల టెండర్లు ఖరారు కాగానే సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. శనివారం సచివాలయంలో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 20 లోగా పనులు పూర్తి చేసి చెరువుల పునరుద్ధరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
పునరుద్ధరణకు ఉద్దేశించి మొత్తం 46,447 చెరువులు ఉండగా ఈ ఏడాది 9,662 చెరువుల్లో పనులు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. పరిపాలన అనుమతులు 2,569 చెరువులకు ఇవ్వగా 1143 చెరువులకు టెండర్లుకు పిలిచామన్నారు. ఇప్పటి వరకు 7,212 చెరువులకు పనుల సర్వే పూర్తి అవ్వగా, పునరుద్ధరనకు అంచనా వేసిన చెరువులు 5,635 ఉన్నాయన్నారు.