Mission bhagiradha
-
భగీరథ.. దాహం తీర్చే
సాక్షి, కల్వకుర్తి: వేసవి వస్తే చాలు పల్లెలు, పట్టణాలని వ్యత్యాసం లేకుండా తాగునీటికి కష్టాలు ఉండేవి. మహిళలు బిందెలు పట్టుకొని వ్యవసాయ పొలాలలోని బోర్ల వద్దకు పరుగులు తీసేవారు. ప్రభుత్వం లీజ్బోర్లు, ట్యాంకర్లతో సరఫరా చేస్తూ రూ.కోట్లు వ్యయం చేసేది. ఎన్ని సమీక్షలు పెట్టినా నిధులు నీళ్ల వ్యయం చేసినా నీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రజలు నీటి బిందెలు పట్టుకొని ధర్నాలు సైతం చేసేవారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కి అధికారులకు ఈ సమస్య పెద్దతలనొప్పిగా మారేది. ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం కేసీఆర్ బృహత్తరమైన ఆలోచన తాగునీటి ఎద్దడికి శాశ్వతమైన పరిష్కారం చూపింది. మిషన్ భగీరథతో అ న్ని చోట్ల తాగునీటి కటకటకు పుల్‌స్టాప్ పడింది. వేసవిలో సైతం దాహం తీరి నీటి కష్టాలు తొలిగాయి. 35 గ్రామాలకు సరఫరా మండలంలోని 35 గ్రామాలకు భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని చోట్ల అవసరాన్ని గుర్తించి కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మం జూరు చేశారు. కొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నా యి. నిర్మాణం పూర్తయిన గ్రామాలు సుద్దకల్, గుండూరు, తాండ్ర, పంజుగుల్, సత్యసాయికాలనీలో కొత్త ట్యాంకులకు నీరు ఎక్కించి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పాత ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు. దాదాపు పెద్దగ్రామాలకు రోజు ల క్ష లీటర్ల చొప్పున సరఫరా చేస్తుంటే చిన్న గ్రామాలకు 50వేల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవిలో సైతం ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో.. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు ఏటా గణనీయంగా పడిపోయి మున్సిపల్ బోర్లే కాదు, ఇళ్లలో ఉండే బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో కల్వకుర్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అంతే కాకుండా దాదాపు 40వేల జనాభా ఉండడంతో నీటి సమస్య జఠిలంగా ఉండేది. దీంతో మున్సిపల్లో కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారానే చేస్తున్నారు. నీటి సరఫరాకు రోజు రూ.లక్ష ట్యాంకర్లకే ఖర్చు పెట్టేవారు. సమస్య తీరేది కాదు. ప్రజలు ఎవరింటికి వారు ట్యాంకర్ల ద్వారా పోయించుకునే వారు. నాలుగేళ్లలో ట్యాంకర్ల కోసం రూ.మూడు కోట్లపైనే వ్యయం చేశారని అంచనా. ఇక భగీరథ వచ్చిన తర్వాత పట్టణానికి నిత్యం 40లీక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. వేసవి వస్తే రోడ్లపై, కాలనీలో ట్యాంకర్ల చప్పుడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఒక్కరోజు తప్పించి మరోరోజు నీటి సరఫరా అవుతుండడంతో పట్టణంలో వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా ఉండడంతో ప్రజలు చాలా సంతోష పడుతున్నారు. వేసవి కాలం అంతా.. సరఫరా మరో రెండు నెలల పాటు వేసవి ఉంటుం ది. భగీరథ నీరు వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయనున్నామని మిషన్ భగీరథ ఈఈ పు ల్లారెడ్డి తెలిపారు. దీంతో ఇక వేసవిలో నీటి సమస్య రాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. వేసవిలో సరఫరా చేస్తే ఇక వర్షాకాలం నల్లేరుమీద నడకలాంటిందే. -
మిషన్ భగీరథకు రూ. 6,750 కోట్లు
- రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన బ్యాంకులు - ఏడు బ్యాంకుల కన్సార్షియం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకానికి రుణ సాయం అందించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో కన్సార్షియంగా ఏర్పడిన ఏడు బ్యాంకులు దాదాపు రూ. 6,750 కోట్ల రుణం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. హైదరాబాద్‌లోని సైఫాబాద్లోగల ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఎండీ, సీఈవో సురేశ్ ఎన్.పటేల్ అధ్యక్షతన బుధవారం జరిగిన కన్సార్షియం సమావేశంలో బ్యాంకులు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాయి. సమావేశంలో సురేశ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రాజెక్టు కోసం తాము ఇప్పటికే రూ. 1,300 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి ఒప్పుకున్నామన్నారు. ఇందులో ఇతర బ్యాంకులను భాగస్వాములను చేసే ఉద్దేశంతో కన్సార్షియం ఆలోచనకు రూపకల్పన చేశామన్నారు. ప్రాజెక్టు డీపీఆర్‌లను తమ బ్యాంకు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాతే బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో రుణ సాయంపై నిర్ణయం తీసుకున్నారన్నారు. మిషన్ భగీరథ రుణాలకు రాష్ట్రం గ్యారంటీగా ఉండటం బ్యాంకర్లలో భరోసా పెరిగిందన్నారు. ఇంకొన్ని బ్యాంకులు కన్సార్షియంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయని, వాటి విషయాన్ని తర్వాతి విడతలో ఆలోచిస్తామన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ లక్ష్యాలు, అవసరాలను పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలువబోతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, దేనా, పంజాబ్ అండ్ సింధ్, సిండికేట్, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. 2019 నుంచి చెల్లింపులు... మిషన్ భగీరథకు రూ. 1,300 కోట్ల రుణాన్ని ఆంధ్రా బ్యాంకు త్వరలోనే అందించనుండగా మిగతా బ్యాంకులు త్వరలోనే తమ బ్యాంకుల మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల్లో రుణ సాయానికి సాంకేతికంగా ఆమోదం తెలిపాక అందించనున్నాయి. 2019 నుంచి గరిష్టంగా 12 ఏళ్లలో రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రుణ సంస్థలైన నాబార్డు, హడ్కో నిబంధనల ప్రకారం తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయి. రుణాలను కరీంనగర్ జిల్లా కోరుట్ల, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని-భూపాలపల్లి, ఎల్ఎండీ, కరీంనగర్, మానకొండూర్తోపాటు వరంగల్ జిల్లాలోని గోదావరి-మంగపేట సెగ్మెంట్లోని మిషన్ భగీరథ పనులకు ఉపయోగించనున్నారు. బ్యాంకులవారీగా ప్రాజెక్టుకు అందనున్న రుణం (రూ.కోట్లలో) ఆంధ్రా బ్యాంకు 1,300 దేనా బ్యాంకు 500 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు 700 సిండికేట్ బ్యాంకు 1,000 ఓబీసీ 1,000 బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 1,000 ఇండియన్ బ్యాంకు 750 అలహాబాద్ బ్యాంకు 500 -
..ఆ మూడింటిపైనే నజర్!
⇒ క్షేత్రస్థాయి నుంచి రాజధాని వరకు సమీక్షలు ⇒ వర్షాకాలం ఆరంభం వరకు లక్ష్యాల సాధనపై దృష్టి ⇒నేడు మంత్రి పోచారం, ఎంపీ కవిత సమీక్ష ⇒ హరితహారం, మిషన్ కాకతీయ, ‘భగీరథ’ కీలకం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు పథకాల అమలుపై అందరూ దృష్టిసారించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం అమలు ప్రజాప్రతినిధులు, అధికారులకు కీలకంగా మారింది. జూన్ 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్పటికే మిషన్ కాకతీయ 1 పనులు పూర్తి చేయడం.. హరితహారం కింద మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఉధృతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మిషన్ భగీరథ కింద జిల్లాలో అన్ని గ్రామాలకు దశలవారీగా మంచినీరు అందించాలన్నది లక్ష్యం కాగా.. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు మొదటి విడతగా తాగునీరు అందించే పనులు కూడా వేగం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించగా.. మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు రెండు దఫాలుగా సమీక్షించారు. అంతకంటే ముందు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అధికారులతో రివ్యూ చేశారు. నిన్నటి వరకు పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన ఆమె జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పసుపు మద్దతు ధర, పసుపు పరిశోధన కేంద్రాల పునరుద్ధరణ, పసుపు బోర్డు ఏర్పాటుపై ఢిల్లీలో కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌లను కలిశారు. మంగళవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎంపీ కవిత హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపైన ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల వేగం పెరగాలి.. మిషన్ భగీరథ కోసం ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ పునర్విభజన ద్వారా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)ని ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 25,78,324 మందికి వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా రక్షిత మంచినీటి ఇంటింటికి నల్లా ద్వారా అందించడం లక్ష్యం. గ్రామీ ణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు, ము న్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయాలనేది నిర్ణయం. ఈ పథకా న్ని రెండు గ్రిడ్లుగా విభజించిన అధికారులు ఒక గ్రిడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మరొకటి సింగూరు ప్రాజెక్టు ఆధారంగా నీటి సరఫరా జరుగుతుంది. ఎస్సారెస్పీ ద్వారా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారె డ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 20 మండలాలు, 860 గ్రామాలు, నిజామాబాద్ కార్పొరేషన్, కామారె డ్డి మున్సిపాలిటీల్లోని 16,34,982 మందికి నీటి సరఫ రా అవుతోంది. అలాగే జుక్కల్, బాన్సువాడ, బోధన్లతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని గ్రా మాలు కలిపి మొత్తం 785 గ్రామాలకు సింగూరు ప్రా జెక్టు నుంచి నీటి సరఫరా చేస్తారు. ఎస్సారెస్పీ నుంచి 1.88 టీఎంసీలు, సింగూరు నుంచి 1.36 టీఎంసీలు కలిపి మొత్తం 3.24 టీఎంసీల నీరును తరలిస్తారు. ఈ నీటిని నిర్దేశించిన అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా అందించేందుకు పల్లెపల్లెకు కొత్తగా పైపులైన్లు నిర్మిం చనున్నారు. మొదట రూ.3,475 కోట్లు అంచనా కాగా రూ.1,350 కోట్లు విడుదలయ్యాయి. అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. అయితే మరో నెలలో వ ర్షాకాలం రాబోతున్నందున వ్యవసాయ క్షేత్రాల్లో జరి గే పనులను ఈ లోపే పూర్తి చేయాలి. అదే విధంగా మిషన్ కాకతీయ 1 పనులు మార్చిలోనే పూర్తి కావా ల్సి ఉండగా.. ఇప్పటికీ 83.55 శాతమే పూర్తయ్యాయి. 658 చెరువుల పునరుద్ధరణ పనులకు అగ్రిమెంట్ జరి గితే 554 చెరువులే 100 శాతం పూర్తి కాగా, పెంచిన గ డువు ప్రకారం ఈ నెలాఖరులోగా 104 చెరువులు పూ ర్తి కావాల్సి ఉంది. మొదటి విడత పనులు పూర్తి కాకపోవడం వల్ల రెండో విడతపై ప్రభావం చూపుతుంది. వచ్చేది వర్షాకాలం... అధిక ప్రాధాన్యం హరితహారం.. తెలంగాణ రాష్ట్రంలో అటవీశాఖ లెక్కల ప్రకారం భౌగోళిక విస్తీర్ణం 1,02,018 చదరపు కిలోమీటర్లు. అందులో 19,149 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. అంటే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం సగటున 16.69 శాతం. ఏ రాష్ట్రంలోనైనా భౌగోళిక విస్తీర్ణంలో కనీసం 33 శాతం తగ్గకుండా అడవులు ఉంటే.. ఆ రాష్ట్రంలో, ప్రాంతంలో పర్యావరణ, ప్రకతి వైఫరీత్యాల సమస్య ఉండదని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా సగటున 16.69 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అంటే కనీసం 16.31 శాతం అడవుల పెంపకం అత్యవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యంతో గతేడాది వారం రోజులపాటు హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే మూడేళ్లలో నిజామాబాద్ జిల్లాలో అడవులు 35.83 శాతంకు పెరిగేందుకు ఏటా జిల్లాలో 3.35 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా జిల్లాలో 411 నర్సరీలను ఏర్పాటు చేశారు. అనుకున్నట్లుగా మొక్కల పెంపకం, నాటడం జరిగితే ఒకే ఏడాదిలో అటవీ విస్తీర్ణం 21.46 శాతం పెరగనుండగా.. రిజర్వు ఫారెస్టు ఏకంగా 3 శాతం అభివృద్ధి చెందనుందనేది అప్పటి అంచనా. ఇదే తరహాలో మూడేళ్లు హరితహారం కొనసాగితే 11.37 శాతం కొత్తగా అటవీ విస్తీర్ణం పెరగనుండగా.. జిల్లాలో అడవుల శాతం 35.83కు చేరనుంది. కాగా అడవులు అంతరిస్తే వాటి దుష్ఫరిణామాలు అందరికీ తెలిసిందే. పర్యావరణ సమతూల్యత దెబ్బతిని అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాను కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జిల్లాలో వరుసగా ఐదేళ్ల నుంచి వర్షభావ పరిస్థితులు వెంటాడుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి జూన్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంటుండగా, ముందస్తుగా హరితహారంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరపనున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం పథకాల వేగం పెంచేందుకు వారు మంగళవారం అధికారులతో రివ్యూ చేయనున్నారు. -
30 వేల కోట్లివ్వండి
► ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి ► కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి ► ‘భగీరథ’కు 10 వేల కోట్లు కేటాయించండి ► ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి సడలించండి ► ప్రధాని నివాసంలో భేటీ ► ఎన్టీపీసీ యూనిట్ శంకుస్థాపనకు ఆహ్వానం ► మార్చి తొలి వారంలో వస్తానన్న ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నామని.. వాటి కోసం భారీగా నిధులు అవసరమైనందున రాష్ట్రానికి రూ. 30,571 కోట్లు ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించనున్నామని.. దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో కేసీఆర్ అరగంట పాటు సమావేశమయ్యారు. రామగుండంలో నిర్మించతలపెట్టిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ... మార్చి మొదటి వారంలో వస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీకి కేసీఆర్ వినతిపత్రాలు సమర్పించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మించతలపెట్టామని.. ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తోందని ప్రధానికి వివరించారు. రూ.71,436 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.4,231 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇక 2013లో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌ను ఐటీఐఆర్ పథకం కోసం ఎంపిక చేసిందని, దీనికి సంబంధించిన స్థలాల గురించి సమగ్ర నివేదిక పంపాలని, అవసరమైన నిధులు కేటాయించాలని కోరా రు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్ర వార్షిక రుణ పరిమితిని జీఎస్డీపీపై 0.5% వరకు పెంచడానికి సిఫారసు చేసిందని... ఈమేరకు ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నెలకొల్పబోయే గిరిజన వర్సిటీని సెంట్రల్ వర్సిటీగా గుర్తించి తగిన నిధులు కేటాయించాలని కోరారు. మిషన్ భగీరథకు సహాయం చేయండి రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం కోసం రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టును చేపట్టామని... దీనికి ప్రత్యేక సహాయం కింద కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో నెలకొల్పనున్న ఎయిమ్స్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించామని... 2016-17 బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, ప్రస్తుతమున్న 112 మంది అధికారుల సంఖ్యను 141కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన త్వరగా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ. 3,064 కోట్లు మంజూరు చేయాలని కోరినా... రూ. 791 కోట్లు మాత్రమే కేటాయించారని, మరిన్ని నిధులు ఇవ్వాలని విన్నవించారు.ఇక రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఇందుకోసం రూ. వేల కోట్లు అవసరమని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. ఈ మేరకు వచ్చే నాలుగేళ్ల కోసం రాష్ట్రానికి రూ. 30,571 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థకు అవసరమైన అనుమతులన్నింటినీ మంజూరు చేయాలని కోరారు.