Mission Kakatiya Program
-
నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
6110.27 జిల్లా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు నిధుల కేటాయింపుపై ఆశలు 2016-17 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి జరుగుతున్న తరుణంలో బడ్జెట్లో జిల్లాకు ఏ మేరకు నిధులు దక్కుతాయనే విషయంపై చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి నల్లానీరందించే మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వంటి మౌలిక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకనుగుణంగా జిల్లా అధికారులు ఆయూ శాఖల వారీగా మొత్తం రూ.6110.27 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇప్పటికే అందచేశారు - కరీంనగర్ సిటీ మిషన్ భగీరథ ప్రాధాన్యం టీఆర్ఎస్ ఎన్నికల హామీలో ప్రధానమైంది ఇంటింటికి తాగునీరందించడం. ఇందుకోసం ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీళ్లు అందించకపోతే ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటించడంతో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకంగా మారింది. ఇందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సైతం ప్రతిపాదనలు తయారు చేసింది. మిషన్ కాకతీయ పథకం ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉండడంతో జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.2540 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. రోడ్లు, రహదారుల పెద్దపీట మిషన్ భగీరథ తర్వాత జిల్లాలో రోడ్లు, రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రహదారులు, భవనాల శాఖ రూ.800 కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ రూ.404.51 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారుు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ లేన్‌ను డబుల్ లేన్‌గా, డబుల్‌ను ఫోర్‌లేన్ మార్చాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌లేన్, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి ఫోర్‌లేన్ రహదారులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు, నాలుగు వరుసల రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు కలిపి రూ.1204 కోట్లు కావాలని ప్రతిపాదనలు సమర్పించారుు. సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.571 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఆర్థిక శాఖకు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయూంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నారుు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కాగా వచ్చే ఖరీఫ్ నుంచి పంటలకు నీళ్లందించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే మధ్యమానేరు ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నుంచి సాగునీరిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు నిధుల కొరత వల్ల ఆగుతూ... సాగుతున్నారుు. ప్రభుత్వ ఆశయూనికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయూలంటే బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటారుుంచాల్సిన అవసరముంది. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసిన ప్రభుత్వం గండిపెల్లి, గౌరవెల్లి జలాశయూల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా బడ్జెట్లో నిధుల కేటారుుంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మిషన్ కాకతీయకు... మిషన్ కాకతీయ ఫేజ్-1 కింద జిల్లాలో 1,188 చెరువుల పునరుద్ధరణ చేపట్టగా, 1,088 చెరువుల సర్వే పూర్తయింది. 822 చెరువులకు పరిపాలన అనుమతి వచ్చింది. 802 చెరువులకు టెండర్లు రాగా, 800 చెరువుల పనులకు అగ్రిమెంట్ పూర్తయ్యాయి. ఇప్పటికి 204 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిషన్ కాకతీయ ఫేజ్-2లో 1,271 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. 1,161 చెరువుల సర్వే పూర్తి కాగా, 1,115 చెరువులకు అంచనాలు రూపొందించారు. 423 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయి.ఇందుకోసం రూ.490 కోట్లు కేటారుుంచాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం టీఆర్ఎస్ మరో ప్రధానమైన హామీ నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం. తొలివిడతగా జిల్లాకు 5200 ఇండ్లు మంజూరు కాగా, ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున కేటారుుంచారు. జిల్లాలో డబుల్ ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు రూ.430 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం రూ.191.62 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ రూ.125.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, మిగిలిన శాఖలు రూ.వంద కోట్లలోపే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారుు. -
తెలంగాణ సుభిక్ష ప్రాంతం
కరీంనగర్ అర్బన్ : తెలంగాణ సుభిక్ష ప్రాంతమని, ఎప్పటికైనా మిగులు బడ్జెట్ తప్ప లోటు బడ్జెట్ లేని ప్రాంతమని ప్రముఖ చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు జెశైట్టి రమణయ్య అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. అమరుల ఆశయూలే బంగారు తెలంగాణ నిర్మాణానికి బాసటగా నిలుస్తాయన్నారు. శుక్రవారం శ్రీనివాస హోటల్లో ‘తెలంగాణ చారిత్రక- సాంస్కృ తికవైభవం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మిషన్ కాకతీయ కూడా కాకతీయ రాజుల స్ఫూర్తితో చేపడుతున్నదేనన్నారు. స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు అధ్యక్షుడు కొండూరి జగన్మోహన్రావు, గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు సముద్రాల జనార్దన్‌రావు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముదుగంటి సుధాకర్‌రెడ్డి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కరీంనరగ్ డెరుురీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య, శ్రీనివాసరాజు, లిమ్కా అవార్డు గ్రహిత సత్య తిరునగరి పాల్గొన్నారు. -
‘మిషన్ కాకతీయ’పై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చెరువు పునరుద్ధరణ పనులను జూన్‌లోగా పూర్తి చేయాల్సి ఉన్న దృష్ట్యా అధికారులు పనులను త్వరితగతిన ఆరంభించాలని, పూడిక మట్టిని ఎక్కువగా తీయడంపై దృష్టి సారించాలని సూచించారు. పూడిక నూర్పిళ్లకు ఉపాధి హామీతో అనుసంధానించే విషయమై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపినట్లు సమాచారం. -
మట్టి పరీక్షల్లో జాప్యం
ఇరు శాఖల మధ్య కొరవడిన సమన్వయం తొలిదశలో 1179 చెరువులకు అనుమతి 202 చెరువుల్లో మాత్రమే పరీక్షలు పూర్తి వరంగల్ : మిషన్ కాకతీయ ప్రార ంభం ఆలస్యమైన విధంగానే చెరువుల మట్టి పరీక్షలూ అదే దారిలో పయనిస్తున్నాయి. చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనఘట్టం పూడికతీత. ఇలా తీసిన మట్టిని వ్యవసాయ భూముల్లో వేసుకునేందుకు సారవంతమైనదా...కాదా అనేది పరీక్షల ద్వారానే తెలుస్తుంది. ఈ మట్టి పరీక్షలు చేయాల్సిన బాధ్యతలను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అప్పగించింది. ఈ మేరకు పునరుద్ధరించనున్న చెరువుల జాబితాను వ్యవసాయ శాఖకు నీటిపారుదల శాఖ అధికారులు అందజేసి చేతులు దులుపుకున్నారు. దీంతో మట్టి పరీక్షలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పునరుద్ధరించే చెరువుల నుంచి మట్టి నమూనాలను తీసి అప్పగిస్తే పరీక్షలు వేగవంతమయ్యేవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండగా... పరీక్షల వ్యవహారం వ్యవసాయ శాఖదే అయినందున మట్టిని చెరువుల నుంచి సేకరించుకోవాల్సిన బాధ్యత వారిదేనని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఇరు శాఖల్లో సమన్వయ లోపం ఫలితంగా మట్టి పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మొదటి విడతలో 1179 చెరువులు చెరువుల పునరుద్ధరణలో భాగం గా ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రవేశపెట్టింది. ఇందులో జిల్లాలోని 5865చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి ఏటా 20 శాతం చెరువులను పునురుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 1179 చెరువుల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ సైతం ఇచ్చింది. ఇప్పటికే పలు విడతల్లో సుమారు 576 చెరువులకు పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. నిధుల కేటాయింపు జరిగిన వాటిలో సుమారు 386 చెరువులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా... ఈ వేసవిలో పనులు ప్రారంభం కానున్నాయి. తొలిదశలో పునరుద్ధరించనున్న వాటిలో 500 చెరువుల్లో మట్టి సేకరించగా, 202 చెరువులకు సంబంధించి మాత్రమే మట్టి పరీక్షలు పూర్తయ్యూరుు. ఇందులో 41 చెరువులకు సంబంధించిన మట్టిలో ఆమ్ల, క్షార గుణాలు ఉన్నట్లు తేలింది. మిగిలిన 161 చెరువుల్లో మట్టిని పొలాల్లో పోసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అరుుతే చెరువుల్లో సారవంతమైన మట్టిని పొలాల్లో పోసుకుంటే రైతులకు మేలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో మట్టి పరీక్షలను వేగవంతం చేయూల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌కు ముందే చెరువు మట్టి పొలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
‘మిషన్’ సక్సెస్ చేస్తాం
ప్రభుత్వం చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అంతా కలిసి పని చేస్తామని జిల్లాలోని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ‘మిషన్ కాకతీయ’పై జిల్లా సాగునీటి పారుదల శాఖ వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ అడిటోరియంలో మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. మిషన్ కాకతీయ అమలులో తీసుకోవాల్సిన అంశాలు, నిబంధనలను, చర్యలను మంత్రి హరీష్‌రావు తొలుత వివరించారు. అనంతరం జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలు ఇవ్వాలని కోరారు. ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు మాత్రమే సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం దక్కింది. కొందరు జెడ్పీటీసీ సభ్యులు వారి వినతి పత్రాలను మంత్రి హారీష్‌రావుకు అందించి వెనుదిరిగారు. - వరంగల్ రూరల్ సంక్షేమంతోపాటు అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలుతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది, తెలంగాణ పునరుద్ధరణలో భాగంగా చరిత్రాత్మక కట్టడాలైన దేవాలయాలు, కోట బురుజులను పరిరక్షించుకోవాలి. వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలి. కులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధ్యాన్యమిస్తున్నారు. - డాక్టర్ తాటికొండ రాజయ్య, డిప్యూటీ సీఎం బంగారు తెలంగాణకు సహకారం అందించాలి బంగారు తెలంగాణలో భా గంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు అందరు సహకారం అందించాలి. పనుల్లో నాణ్యత ఉండేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. - గద్దల పద్మ, జెడ్పీ చైర్పర్సన్ విస్తృత ప్రచారం నిర్వహించాలి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలి. నగరంలోని రంగసముద్రం, దామెర చెరువు, భద్రకాళి, చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, బెస్తం, గుండు, పెద్దకర్త చెరువు కట్టపై ట్యాంక్‌బండ్‌ను తీర్చిదిద్దాలి. కట్ట మైసమ్మ దేవతలకు గుళ్లు నిర్మించాలి. - కొండా సురేఖ, ఎమ్మెల్యే వరంగల్ తూర్పు కేబుల్ టీవీల్లో ప్రసారం చేయాలి మిషన్ కాకతీయపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిం చేందుకు గ్రామాల్లోని కేబుల్ టీవీ ల్లో ప్రసారం చేయాలి. వీటిని ప్రసారం చేయడం ద్వారా విస్తృతంగా వారికి అవగాహన కలుగుతుంది. సీడీ రూపకల్పన చేయాలని భావిస్తున్నం దున మంత్రి హరీష్‌రావు సహకారం అందించాలి. అజ్మీరా సీతారాంనాయక్, ఎంపీ, మహబూబాబాద్ మట్టి అందరికీ అందాలి చెరువుల్లో తీసిన పూడిక మట్టి రైతులందరికి అందేలా నిబంధనలు పెట్టాలి. లేదంటే పెద్ద రైతులు వారి పొలాల్లో మొత్తం మట్టి తీసుకుపోతే సన్నకారు రైతులు ఇబ్బందులు పడతారు. ఈ విషయం జలవికాస కార్యక్రమంలో ఎదుర్కొన్నాం. రైతుల నుంచి డిమాండ్ వివరాలు తీసుకుని మిగతా మట్టిని పెద్ద రైతులు తీసుకపోయేందుకు అనుమతించాలి. నగర పరిధిలోని చెరువుల్లో మట్టిని ఖాళీ ప్లాట్లలో పోసుకునేలా కార్పొరేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలి. ఇందువల్ల ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా పోతుంది. - శౌరిరెడ్డి, బాల వికాస సంస్థ, ప్రతినిధి మంత్రి : మునిసిపల్ అధికారులతో మాట్లాడి ఈ ప్రతిపాదన అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయిస్తాం. మట్టి తరలింపునకు రవాణా చార్జీలు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చెరువుల నిల్వ సామర్థ్యం పెం చేందుకు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం హర్షనీయం. గ్రామాల్లో పూడికతీత మట్టిని రైతులు 30 శాతం వరకు మాత్రమే తీసుకెళ్లే అవకాశముంది. పూడిక తీసిన మట్టిని పూర్తిస్థాయిలో తరలించేందుకు రవాణా చార్జీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. మట్టి ఎంత లోతు తీయూలనే విషయూన్ని స్పష్టంగా ప్రచారం చేయాలి. పాకాల చెరువులో 3.75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు నిధులివ్వాలి. - దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్యే నర్సంపేట మంత్రి : అన్ని విషయాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలి మహబూబాబాద్ పట్టణంలో ఉన్న పలు చెరువుల శిఖం భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ చెరువుల ఫుల్ట్యాంకు లెవల్‌ను నిర్ధారించి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలోని కంబాలపల్లి, ఈదులపూసలపల్లి, మైసమ్మ, నిజాం చెరువుల అభివృద్ధి మొదటి విడతలో పెట్టే విధంగా మంజూరు చేయాలి. - శంకర్‌నాయక్, ఎమ్మెల్యే మహబూబాబాద్ మంత్రి : తప్పకుండా నిధులు మంజూరు చేస్తాం.. గౌరారం వాగును మల్లూరు ప్రాజెక్టులోకి మళ్లించాలి మంగపేట మండలంలోని మల్లూరు వాగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలంటే గౌరారం వాగు, కప్పవాగులను మళ్లించాలి. ఫీడర్ ఛానళ్ల మరమ్మతుకు నిధులు కేటాయించాలి. కొత్తగూడ మండలంలో అత్యధికంగా చెరువులున్నాయి. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాలతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మండలంలో విజయవంతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. - అజ్మీరా చందూలాల్, ఎమ్మెల్యే ములుగు మంత్రి : అటవీ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవద్దు. చెరువులతో అడవులకు నష్టం కలుగుతుందని భావిస్తే పునరుద్ధరణ నిధులను అటవీశాఖకే కేటాయిస్తాం. ఇరిగేషన్ అధికారులు రూపొందించిన విధంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంపై కలెక్టర్ నేతృత్వంలో ఇరిగేషన్ ఎస్ఈ, ఫారెస్టు అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలి. మట్టి తరలించేందుకు నిధులు కేటాయించాలి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెరువుల్లో తీసిన మట్టి ట్రాక్టర్లతో తీసుకెళ్లేందుకు నిధులు కేటాయించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా కృషి చేయాలి. ఎస్సారెస్పీ కాల్వలు తవ్వినప్పటికీ నీరు రావడం లేదు. పనులు పూర్తి కాకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఫీడర్ ఛానళ్లకు మరమ్మతులు చేయాలి. - డీఎస్ రెడ్యానాయక్, ఎమ్మెల్యే డోర్నకల్ మంత్రి : ఈజీఎస్‌లో ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వరు. కేవలం మట్టి పొలాల్లో స్ప్రెడ్డింగ్ చేసుకునేందుకు అయ్యే వ్యయం ఇస్తామన్నారు. సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి నగర పరిధిలోని చెరువులను తాగునీటి రిజర్వాయర్లుగా మార్చారు. అందువల్ల అందులోకి పక్కనే ఉన్న కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చేరకుండా సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. బంధం, దర్గా చెరువులను అభివృద్ధి చేసి బోటింగ్ ఏర్పాటు చేయాలి. అయకట్టు లేని చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలి. - వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ మంత్రి హరీష్‌రావు సమాధానం : సీవరేజి ప్లాంట్ల ఏర్పాటు విషయం సంబంధిత మున్సిపల్ శాఖతో చర్చంచి చర్యలు తీసుకుంటాం. బోటింగ్‌తోపాటు విడిది కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖతో నిధులు కేటాయించేందుకు కృషి చేస్తాం. చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలి వరంగల్ నగరానికి అనుకుని ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. గ్రేటర్ వరంగల్‌లో భాగంగా 42 గ్రామాలు విలీనం కాగా అందులో 31 గ్రామాలు నా పరిధిలోవే. సాగుభూములను ప్లాట్లుగా చేయడంతో హన్మకొండ మండలంలోని పలు చెరువులు ఆయకట్టు లేకుండా ఉన్నాయి. ఇలా మారిన అమ్మవారిపేట చెరువు, భట్టుపల్లి, హసన్‌పర్తిలోని చెరువులను అభివృద్ది చేసి నగరవాసులకు తాగు నీరందించే స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చాలి. - అరూరి రమేష్, ఎమ్మెల్యే వర్ధన్నపేట మంత్రి : పూడికతీతలో తీసిన మట్టిని రైతులు తీసుకుపోగా మిగిలిన దాంతో బావుల బొందలు నింపేందుకు చర్యలు తీసుకుంటాం. మీ కోరికను పరిశీలించి న్యాయం చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వాలి చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించేందుకు నిర్ణయం తీసుకున్నందున అందులో ఏక్ ఫసల్ పట్టాలు తీసుకున్న ఎస్సీ, ఎస్టీలకు భూములు కొనుగోలు చేసి ఇ స్తే ఎలాంటి సమస్యలు రావు. కట్టు కా ల్వలను తప్పని సరిగా అభివృద్ధిచేయాలి. తద్వారా నిల్వ సామర్థ్యం పెరిగి మిషన్ కాకతీ య లక్ష్యం నెరవేరుతుంది. ఈ చెరువు పనుల్లో ఏ రాజ కీయ నాయకుడికి పర్సెంటెజీలు ఇవ్వొద్దు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి.. మంత్రి దృష్టికి తీసుకెళుతా. - కడియం శ్రీహరి, ఎంపీ, వరంగల్ అభివృద్ధిపై అభిప్రాయం మారాలి చెరువు పనులంటే లక్షల్లో లాభం వస్తుందన్న అభిప్రాయం అందరిలో ఉంది. ఈ ఆలోచన మారాలి. దేవాదుల పైప్‌లైను పోతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. ఎస్సారెస్పీలో నీరు లేనందున కాల్వలు నిరుపయోగంగా ఉన్నాయి. సాగు నీరందించేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలి. చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే, పరకాల