ఇరు శాఖల మధ్య కొరవడిన సమన్వయం
తొలిదశలో 1179 చెరువులకు అనుమతి
202 చెరువుల్లో మాత్రమే పరీక్షలు పూర్తి
వరంగల్ :
మిషన్ కాకతీయ ప్రార ంభం ఆలస్యమైన విధంగానే చెరువుల మట్టి పరీక్షలూ అదే దారిలో పయనిస్తున్నాయి. చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనఘట్టం పూడికతీత. ఇలా తీసిన మట్టిని వ్యవసాయ భూముల్లో వేసుకునేందుకు సారవంతమైనదా...కాదా అనేది పరీక్షల ద్వారానే తెలుస్తుంది. ఈ మట్టి పరీక్షలు చేయాల్సిన బాధ్యతలను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు అప్పగించింది. ఈ మేరకు పునరుద్ధరించనున్న చెరువుల జాబితాను వ్యవసాయ శాఖకు నీటిపారుదల శాఖ అధికారులు అందజేసి చేతులు దులుపుకున్నారు. దీంతో మట్టి పరీక్షలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పునరుద్ధరించే చెరువుల నుంచి మట్టి నమూనాలను తీసి అప్పగిస్తే పరీక్షలు వేగవంతమయ్యేవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండగా... పరీక్షల వ్యవహారం వ్యవసాయ శాఖదే అయినందున మట్టిని చెరువుల నుంచి సేకరించుకోవాల్సిన బాధ్యత వారిదేనని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఇరు శాఖల్లో సమన్వయ లోపం ఫలితంగా మట్టి పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
మొదటి విడతలో 1179 చెరువులు
చెరువుల పునరుద్ధరణలో భాగం గా ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ను ప్రవేశపెట్టింది. ఇందులో జిల్లాలోని 5865చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ప్రతి ఏటా 20 శాతం చెరువులను పునురుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 1179 చెరువుల అభివృద్ధికి గ్రీన్‌సిగ్నల్ సైతం ఇచ్చింది. ఇప్పటికే పలు విడతల్లో సుమారు 576 చెరువులకు పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. నిధుల కేటాయింపు జరిగిన వాటిలో సుమారు 386 చెరువులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా... ఈ వేసవిలో పనులు ప్రారంభం కానున్నాయి. తొలిదశలో పునరుద్ధరించనున్న వాటిలో 500 చెరువుల్లో మట్టి సేకరించగా, 202 చెరువులకు సంబంధించి మాత్రమే మట్టి పరీక్షలు పూర్తయ్యూరుు. ఇందులో 41 చెరువులకు సంబంధించిన మట్టిలో ఆమ్ల, క్షార గుణాలు ఉన్నట్లు తేలింది. మిగిలిన 161 చెరువుల్లో మట్టిని పొలాల్లో పోసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అరుుతే చెరువుల్లో సారవంతమైన మట్టిని పొలాల్లో పోసుకుంటే రైతులకు మేలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో మట్టి పరీక్షలను వేగవంతం చేయూల్సిన అవసరం ఉంది. ఖరీఫ్‌కు ముందే చెరువు మట్టి పొలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మట్టి పరీక్షల్లో జాప్యం
Published Mon, Mar 16 2015 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement