కరీంనగర్ అర్బన్ : తెలంగాణ సుభిక్ష ప్రాంతమని, ఎప్పటికైనా మిగులు బడ్జెట్ తప్ప లోటు బడ్జెట్ లేని ప్రాంతమని ప్రముఖ చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు జెశైట్టి రమణయ్య అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. అమరుల ఆశయూలే బంగారు తెలంగాణ నిర్మాణానికి బాసటగా నిలుస్తాయన్నారు. శుక్రవారం శ్రీనివాస హోటల్‌లో ‘తెలంగాణ చారిత్రక- సాంస్కృ తికవైభవం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మిషన్ కాకతీయ కూడా కాకతీయ రాజుల స్ఫూర్తితో చేపడుతున్నదేనన్నారు.
స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు అధ్యక్షుడు కొండూరి జగన్మోహన్‌రావు, గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షుడు సముద్రాల జనార్దన్‌రావు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముదుగంటి సుధాకర్‌రెడ్డి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కరీంనరగ్ డెరుురీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య, శ్రీనివాసరాజు, లిమ్కా అవార్డు గ్రహిత సత్య తిరునగరి పాల్గొన్నారు.
తెలంగాణ సుభిక్ష ప్రాంతం
Published Sat, May 16 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement