మిస్టర్ వరల్డ్‌కు అభినందన
సాక్షి, కాచిగూడ: మిస్టర్ వరల్డ్ రోహిత్ మంగళవారం కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య ఇంట్లో సందడి చేశారు. కార్పొరేటర్ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. చిన్ననాటి నుంచి కార్పొరేటర్ కుటుంబంలో ఒకరిగా ఉన్నానని ఈ సందర్భంగా రోహిత్ తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి ఎక్కాల కన్నా, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు ఎక్కాల నందు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.