mla jaya ramulu
-
దుష్ప్రచారం ఆపకపోతే రాజీనామా: ఫిరాయింపు ఎమ్మెల్యే
బద్వేలు అర్బన్ : వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జయరాములు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇప్పటికైనా వారు స్పందించకపోతే తనతో పాటు, తన అనుచర వర్గమంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననని తేల్చిచెప్పారు. శనివారం బద్వేలు ఆర్అండ్బీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీలోని కొందరు అగ్రవర్ణ నేతలు దళితుడినైన తనను అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని, తాను చేపట్టే కార్యక్రమాలకు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తెలియచేసినా చర్యలు తీసుకోకపోగా, వారికే వత్తాసు పలకడం తగదన్నారు. -
నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
బద్వేలు: నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు పేర్కొన్నా రు. నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. బ్రహ్మంసాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టునుంచి నీరు ఇవ్వాలని కోరతామన్నారు. మూడేళ్లుగా నియోజకవర్గ రైతాంగం ఇబ్బంది పడ్డారని ఈ ఏడు పూర్తిస్థాయిలో ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలని చెప్పారు. పలు మండలాలలో ఉపాధి పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రజల సొమ్మును స్వాహా చేసిన వీరందరిపై విచారణ జరిగి చర్యలు తీసుకునేలా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని చెప్పారు. బెల్టుషాపులపై ఎక్సైజ్ శాఖ నియంత్రణ కోల్పోయిందని చెప్పారు. దీంతోపాటు పలుసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు.