MLA Maganti Gopinath
-
జూబ్లీహిల్స్ లో అమానుష ఘటన
-
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం
-
దిగ్విజయ్ వ్యాఖల పై పోలీసులకు ఫిర్యాదు
-
పవర్ ఆఫ్ రిలేషన్షిప్
అలీ రెజా, సీతానారాయణన్ జంటగా ఎన్.లక్ష్మి నంద దర్శకత్వంలో మువ్వ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రామ్ – ఎన్.ఆర్.ఐ’. పవర్ ఆఫ్ రిలేషన్షిప్.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక– నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరికీ ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాం. సామాజిక స్పృహతో మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచే ్చలా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నిర్మాతలు టి. ప్రసన్నకుమార్, సాయివెంకట్, మేకా రమేష్, నటీనటులు విజయ్‌చందర్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: నాగబాబు కర్ర. -
కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ
♦ టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం! ♦ మరో ఎమ్మెల్యే గాంధీ కూడా చేరతారని ప్రచారం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కొద్దిరోజులుగా గోపీనాథ్ సైతం అధికార టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన సీఎంను కలవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గోపీనాథ్, ఆయనతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం. మిగిలేది ముగ్గురేనా! పదిహేను మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీడీపీలో ప్రస్తుతం మిగిలింది కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, ఆర్.కృష్ణయ్య టీడీపీ శిబిరంలో ఉన్నారు. తాజాగా గోపీనాథ్ సీఎంతో భేటీ కావడంతో టీఆర్ఎస్లో ఆయన చేరిక కూడా దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మరో ఎమ్మెల్యే గాంధీ సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీ మారితే ఇక, మిగిలేది ముగ్గురే. సోమవారం ఎన్టీఆర్భవన్లో జరిగిన మాజీ మంత్రి మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అయితే గోపీనాథ్, గాంధీ ఇద్దరూ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమైనట్లేనని, అందుకే చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని చెబుతున్నారు. -
మత్తయ్యకు ఏసీబీ నోటీసులు
♦ ‘ఓటుకు కోట్లు’ కేసులో కదలిక ♦ వారం రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ఆదేశం ♦ తనకు నోటీసులివ్వడం కోర్టు ధిక్కరణే అంటున్న మత్తయ్య ♦ త్వరలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కూ నోటీసులు! సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ‘ఓటుకు కోట్లు’ కేసులో కదలిక వచ్చింది. గతేడాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన విషయం తెలిసిందే. అందులో భాగం గా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా పలువురు రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డారు. తాజాగా ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు ఏసీబీ నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని మత్తయ్య ఇంటికి శనివారం ఏసీబీ అధికారులు వెళ్లి స్వయంగా నోటీసులు అందజేశారు. వారంలోగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మత్తయ్య హాజరుపై సస్పెన్స్.. ‘ఓటుకు కోట్లు’ కేసులో మత్తయ్య వ్యవహారశైలి కీలకంగా మారనుంది. ఈ కేసులో ఇప్పటివరకు పదుల సంఖ్యలో అనుమానితులను విచారించిన ఏసీబీ... ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్యను మాత్రం విచారించలేకపోయింది. అసలు ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెలుగు చూసిన క్షణం నుంచి మత్తయ్య కనిపించకుండా పోయారు. ఏసీబీ తనను అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా మత్తయ్యను విచారించాలని ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్టు చేయబోమని కూడా నోటీసులో పేర్కొంది. కానీ మత్తయ్య మాత్రం తనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. కేసులో తదుపరి చర్యలన్నింటిపైనా న్యాయస్థానం స్టే విధించిందని, అలాంటప్పు డు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాను మరోసారి కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఏసీబీ అధికారులు మాత్రం అరెస్టుపై మాత్రమే స్టే ఉందని, విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ పాత్రపై ఆరా.. ‘ఓటుకు కోట్లు’ కేసు కుట్రలో జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రమేయమున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మాగంటి ప్రధాన అనుచరుడైన ప్రదీప్ చౌదరిని ఏసీబీ ఇంతకుముందే పలుమార్లు విచారించగా పలు కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. గతేడాది మే 29, 30 తేదీల్లో రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ప్రదీప్ చౌదరిల మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. కాల్‌డేటా ఆధారంగా ప్రదీప్‌ను ప్రశ్నించినప్పుడు డబ్బుకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా మాగంటిని కూడా కేసులో నిందితుల జాబితాలో చేర్చాలని ఏసీబీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటగా ఆయనకు సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారణకు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యచరణపై దృష్టిసారించనున్నారు. నన్ను ఒంటరిని చేశారు ‘ఓటుకు కోట్లు’ కేసు లో తనను ఒంటరిని చేశారని ఏ-4 నిం దితుడు జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఏసీబీ నోటీసులు అందిన వెంటనే టీడీపీ కార్యాలయానికి వెళితే ఎవరూ తనను పట్టించుకోలేదని చెప్పారు. నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా స్పందించడంలేదన్నారు. అరెస్టుపై స్టే ఇప్పించిన అడ్వొకేట్ల దగ్గరికి వెళ్లినా చేదు అనుభవమే ఎదురైందని... మరోసారి తమ వద్దకు రావద్దని, ఫోన్లు కూడా చేయవద్దని చెబుతున్నారని చెప్పారు. -
ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆఫీస్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్పొరేటర్ టిక్కెట్ ఇస్తానని తనని నమ్మించి మోసం చేశారని ముస్తాక్ షరీఫ్ అనే వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. అక్కడున్న వారు ముస్తాక్‌ను ఆత్మహత్యకు పాల్పడకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే గోపీనాథ్‌ను మీడియా సంప్రదించగా... ముస్తాక్ షరీఫ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తికాదని వివరణ ఇచ్చారు. కేవలం 15 రోజుల కిందట టీడీపీలో చేరతానని ముస్తాక్ షరీష్ అనే వ్యక్తి తనను కలిశాడని గోపీనాథ్ తెలిపారు.