MLA Nehru jyotula
-
బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే బాబు విదేశీ యాత్రలు
జడ్డంగి(రాజవొమ్మంగి) : బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరుచూ విదేశీ యాత్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు దీనిని సహించరని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ సీపీ రాజవొమ్మంగి మండల కన్వినర్ సింగిరెడ్డి రామకృష్ణ ఇంట జడ్డంగిలో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన నెహ్రూ తిరిగి వెళుతూ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రతిపక్షంపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయించడం సరికాదన్నారు. పిల్లలను కనాలని చెబుతున్న సీఎం మనకు లభిస్తున్న ఆహారశాతం ఎంత, పెరుగుతున్న జనాభా ఎంతనేది బేరీజు వేసుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ జననాలరేటు పెరిగితే అది తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు చెప్పుకోవాలని చూస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. మన దేశంలో, రాష్ట్రంలో యువరక్తానికి లోటులేదని వారికి తగిన అవకాశాలు చూపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలకు పౌష్టికాహారం అందజేసేందుకు కృషి చేయాలని ఆయన సీఎంకు సూచించారు. ప్రస్తుత మానవవనరులను మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఎక్కడో జపాన్లోని పరిస్థితులను మనకు అన్వయించాలని చూసేముందు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆకళింపుచేసుకోవాలి కదా అని పేర్కొన్నారు. రుణమాఫీ ఒక అంకెల గారడీ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతం వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో, జిల్లాలో రోజురోజుకు బలోపేతమవుతుందని నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. మరో మూడు నెలలో పార్టీ సభ్యత్వాల నమోదులో అద్భుత ఫలితాలను చూడవచ్చన్నారు. ఆయనతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ చప్పా నూకరాజు, సర్పంచ్ కొంగర మురళీకృష్ణ తదితర వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ప్రత్తిపాడు ఎంఎల్ఏ. పరుపుల సుబ్బారావు కూడా హాజరయ్యారు. -
ప్రజా సమస్యలపై పోరాడదాం
అంబాజీపేట :ప్రభుత్వం అవలంస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా సమస్యలపై శక్తివంచన లేకుండా పోరాడాలని ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్, ఏవీఆర్ కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన పి. గన్నవరం నియోజకవర్గ సమీక్ష సమావేశం శనివారం జరిగింది. ఆ సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ అమలు, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణమాఫీలో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుండే కృషి చేస్తానన్నారు. మాజీమంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిపై పరిపూర్ణ అవగాహన ఉన్న చంద్రబాబు, రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రంపచోడవరం, కొత్తపేట ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతీ నాయకుడు, కార్యకర్త పోరాడుతూ పార్టీని మరింత పటిష్టపరచాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు బడ్జెట్లో అంకెలు తప్ప నిధులు లేవని ఎద్దేవా చేశారు. తొలుత పార్టీ మండల కన్వీనర్లు దొమ్మేటి సాయికృష్ణ, అడ్డగళ్ల వెంకట సాయిరాం, బొలిశెట్టి భగవాన్, మద్దా చంటి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, సర్పంచ్లు కాండ్రేగుల గోపి, తనికెళ్ల మణిబాబు, కసిరెడ్డి అంజిబాబులతో పాటు పలువురు జిల్లా అధ్యక్షుడు నెహ్రూకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయిలను ఘనంగా సన్మానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, విభాగపు కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, మంతెన రవిరాజు, శెట్టిబత్తుల రాజబాబు, గిరిజాల వెంకటస్వామినాయుడు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అత్తిలి సీతారామస్వామి, ఎంపీటీసీ సభ్యులు ఉందుర్తి ఆనందబాబు, బూడిద వరలక్ష్మి, కోమలి అనంతలక్ష్మి, కోట విజయరావు, సీనియర్ నాయకులు ఎంఎం శెట్టి, పేరి శ్రీనివాసరావు, కొర్లపాటి కోటబాబు తదితరులు పాల్గొన్నారు. నేడు ‘అమలాపురం’ సమీక్ష అమలాపురం : అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఆదివారం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పట్టణ పార్టీ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమలాపురం సూర్యానగర్లోని కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ సమావేశం జరుగుతుందని వారు వివరించారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా జ్యోతుల నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జరుగుతున్న సమీక్షా సమావేశమని వారు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పట్టణ, మండల పార్టీల కన్వీనర్లు, జిల్లా అనుబంధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు కోరారు. -
నేడు జిల్లాకు జ్యోతుల రాక
జగ్గంపేట : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ హోదా దక్కాక తొలిసారిగా ఆదివారం జిల్లాకు రానున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మెట్ట ప్రాంత దిగ్గజనేత జ్యోతులకు పగ్గాలు అప్పజెప్పడంతో పార్టీ జిల్లా క్యాడర్లో నూతనోత్తేజం నిండిది. ఇప్పటికే పార్టీ సీజీసీ సభ్యునిగా, శాసనసభాపక్ష ఉపనేతగా సమర్థంగా పని చేస్తున్న జ్యోతులకు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించడంతో ఆయన సొంత నియోజకవర్గం జగ్గంపేటలో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న జ్యోతుల ఆదివారం ఉదయం స్వగ్రామం ఇర్రిపాక రానున్నారు. అక్కడి నుంచి ఉదయం అన్నవరం చేరుకుని సత్యదేవుడిని దర్శించుకుండారు. తర్వాత కాకినాడ వెళ్లి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి కాకినాడ గంగరాజునగర్ మొదటి వీధిలోని తన సోదరుడు జ్యోతుల సుబ్బారావు ఇంటి వద్ద అందుబాటులో ఉంటారు. సాయంత్రం వరకు అక్కడే కార్యకర్తలు, పార్టీ నాయకులతో ముచ్చటిస్తారు. రాత్రి గౌతమీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళతారు.