నేడు జిల్లాకు జ్యోతుల రాక
జగ్గంపేట : వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ హోదా దక్కాక తొలిసారిగా ఆదివారం జిల్లాకు రానున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మెట్ట ప్రాంత దిగ్గజనేత జ్యోతులకు పగ్గాలు అప్పజెప్పడంతో పార్టీ జిల్లా క్యాడర్‌లో నూతనోత్తేజం నిండిది. ఇప్పటికే పార్టీ సీజీసీ సభ్యునిగా, శాసనసభాపక్ష ఉపనేతగా సమర్థంగా పని చేస్తున్న జ్యోతులకు అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించడంతో ఆయన సొంత నియోజకవర్గం జగ్గంపేటలో ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న జ్యోతుల ఆదివారం ఉదయం స్వగ్రామం ఇర్రిపాక రానున్నారు. అక్కడి నుంచి ఉదయం అన్నవరం చేరుకుని సత్యదేవుడిని దర్శించుకుండారు. తర్వాత కాకినాడ వెళ్లి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి కాకినాడ గంగరాజునగర్ మొదటి వీధిలోని తన సోదరుడు జ్యోతుల సుబ్బారావు ఇంటి వద్ద అందుబాటులో ఉంటారు. సాయంత్రం వరకు అక్కడే కార్యకర్తలు, పార్టీ నాయకులతో ముచ్చటిస్తారు. రాత్రి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళతారు.