MLA pratap
-
నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులున్నందున ఎన్నెస్పీ ఉన్నతాధికారులు వెంటనే నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో నూజివీడు, బాపులపాడు, మాచవరం మేజర్లు ఉన్నాయని, వీటి పరిధిలోని చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయన్నారు. ఈ చెరువుల కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో కూడా కేవలం మూడురోజులు మాత్రమే సాగర్‌జలాలను సరఫరా చేసి నిలిపివేశారన్నారు. చెరువులు నింపకపోతే వ్యవసాయ బోర్లులో కూడా నీటిమట్టం పడిపోయి ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు అధికారులు ప్రభుత్వానికి తెలిపి సాగర్‌జలాలు సరఫరా చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆగిరిపల్లిలోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును సాగర్‌జలాలతో నింపాలన్నారు. అతిపెద్దచెరువైన కొమ్మూరు చెరువును నింపాలన్నారు. నూజివీడు మేజర్‌పై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా సుంకొల్లు, యనమదల చెరువులతో పాటు నూజివీడు పెద్ద చెరువును సాగర్‌జలాలతో నింపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూజివీడుప్రాంతానికి సాగర్‌జలాలను మళ్లించి చెరువులను నింపాలని సూచించారు. -
సాగర్ జలాలు విడుదలచేసి దాహార్తి తీర్చండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రతాప్ నూజివీడు : ఎన్నెస్పీ మూడో జోన్ పరిధిలో ఉన్న పశ్చిమకృష్ణాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నూజి వీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలలో భాగంగా గురువారం నిర్వహిం చిన జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసి చెరువులు నింపకపోతే వచ్చే రెండు నెలలు ఈ ప్రాంత ప్రజలతోపాటు పశువులు, జీవాలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఎన్నెస్పీ మూడో జోన్లో ఉన్న తమ ప్రాంతానికి నవంబర్ నుంచి సాగర్ జలాలను వాడుకునే హక్కు ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఒక్కచుక్క నీటిని కూడా ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమకృష్ణాలో చెరువులన్నీ ఎండిపోయాయని, బావులు, బోర్లలోని నీటిమట్టం పడిపోవడంతో నీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పడిపోవడం వల్ల నూజివీడు పట్టణానికి కృష్ణాజలాలు అందించే పథకానికి అందక ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మూడోజోన్‌కు సాగర్ జలాలు తీసుకొచ్చి చెరువులను నింపి వేసవిలో తమప్రాంత ప్రజలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రతాప్ కోరారు.