నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి | realease sagar water to nuziveedu canals | Sakshi
Sakshi News home page

నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి

Published Mon, Jan 16 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి

నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలు సరఫరా చేయాలి

నూజివీడు: నూజివీడు ప్రాంతంలో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులున్నందున ఎన్నెస్పీ ఉన్నతాధికారులు వెంటనే నూజివీడు ప్రాంతానికి సాగర్‌జలాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు డిమాండ్‌ చేశారు. స్థానిక ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ నూజివీడు బ్రాంచి కాలువ పరిధిలో నూజివీడు, బాపులపాడు, మాచవరం మేజర్లు ఉన్నాయని, వీటి పరిధిలోని చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయన్నారు. ఈ చెరువుల కింద సాగుచేసిన ఆరుతడి పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో కూడా కేవలం మూడురోజులు మాత్రమే సాగర్‌జలాలను సరఫరా చేసి నిలిపివేశారన్నారు. చెరువులు నింపకపోతే వ్యవసాయ బోర్లులో కూడా నీటిమట్టం పడిపోయి ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులు అధికారులు ప్రభుత్వానికి తెలిపి సాగర్‌జలాలు సరఫరా చేసేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఆగిరిపల్లిలోని  సమ్మర్‌స్టోరేజీ ట్యాంకును సాగర్‌జలాలతో నింపాలన్నారు. అతిపెద్దచెరువైన కొమ్మూరు చెరువును నింపాలన్నారు. నూజివీడు మేజర్‌పై ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా సుంకొల్లు, యనమదల చెరువులతో పాటు నూజివీడు పెద్ద చెరువును సాగర్‌జలాలతో నింపాలన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నూజివీడుప్రాంతానికి సాగర్‌జలాలను మళ్లించి చెరువులను నింపాలని సూచించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement