ఏంటి రాజకీయాలు చేస్తున్నారా?
మహేశ్వరం : ‘ఏంటి రాజకీయాలు చేస్తున్నారా? సమావేశంలో ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్లండి’ అని ఎంపీటీసీ సభ్యులపై ఎమ్మెల్యే తీగల ఆగ్రహంతో ఊగిపోయారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ సమావేశం హాలులో బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామజ్యోతిలో తమకు ప్రాధాన్యత కల్పించి, గ్రామాల్లో చిప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టవద్దని పలువురు విపక్ష సభ్యులు నిరసన తెలిపారు.
ప్లకార్డులతో నిరసన చేస్తున్న ఎంపీటీసీలపై ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు, ఘట్టుపల్లి ఎంపీటీసీ సలేంద్ర శ్రీశైలం గ్రామజ్యోతిలో తమను భాగస్వాములను చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తుండగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు చాలా ప్రాధాన్యత ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ ద్వారా కొన్ని మండలాలకే నీరు వస్తున్నాయని , పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా అని ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు.
సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమవేశానికి ఎంపీటీసీలు పలువురు బహిష్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కో ఆప్షన్ సభ్యుడు షేక్ అబుబాకర్ పాల్గొన్నారు.