దీక్షలకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మద్దతు
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వారికి సంఘీభావం తెలిపారు. కొన్ని చోట్ల పోలీసులు వారి దీక్షలను భగ్నం చేస్తున్నారు. దేవరపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు తలారి వెంకట్రావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ సీపీ నేత విష్ణు చేపట్టిన ఆమరణ దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విష్ణు దీక్షకు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చింతలపుడిలో దీక్ష చేస్తున్న జర్నలిస్టుల జెఎసికి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ పేరుతో, టీడీపీ బస్సుయాత్ర పేరుతో ప్రజలను వంచిస్తున్నారన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర తెలంగాణ కోసమా? సమైక్యాంధ్ర కోసమా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా జీలుగుమిల్లులో వైఎస్ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేస్తున్నారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా మాదేపల్లిలో చేస్తున్న నిరసన దీక్షలో పీవీరావు పాల్గొన్నారు. ఉండి జేఏసీ ఆధ్వర్యంలలో మహిళలు,ఉపాధ్యాయులు మౌన ప్రదర్శన నిర్వహించి, దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు, వైఎస్ఆర్ సిపి నేత పాతపాటి సర్రాజు పాల్గొన్నారు.