MLC bhanuprasad
-
కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా
ఎమ్మెల్సీ భానుప్రసాద్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యం నడిచిందని, అప్పుడు 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రంలో ఇసుక మీద ఏడాదికి కేవలం రూ.10 కోట్ల ఆదాయం వస్తే, పది జిల్లాల(పాత) తెలంగాణలో ఏడాదికి రూ.450 కోట్ల ఆదాయం వచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ఇసుక వ్యవహారంపై ఉత్తమ్,షబ్బీర్, శ్రీధర్‌బాబు, వీహెచ్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. -
ఊరూరా తీర్మానిస్తే జిల్లా..
పెద్దపల్లి: ఊరూరా సమావేశాలు నిర్వహించి కేసీఆర్ జిల్లాగా తీర్మానిస్తే పెద్దపల్లికి ఆ పేరు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో జిల్లా సంబరాలు ఘనంగా నిర్వహించారు. టపాసులు పేల్చడం, డిజే సౌండ్, తెలంగాణ పాటలు, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం తదితర కార్యక్రమాలతో టీఆర్ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అడగకుండానే జిల్లా ఇచ్చిన ముఖ్యమంత్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధికి పెద్ద పీటవేస్తుందన్నారు. సంబరాల్లో నగర పంచాయతీ చైర్మన్ ఎల్. రాజయ్య, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, సారయ్య గౌడ్, లంక సదయ్య, పడాల తార, సందవేన సునీత, రేవతిరావు, కాంపెల్లి నారాయణ, మార్కు లక్ష్మణ్, ఎరుకల రమేష్, సతీష్ గౌడ్, రాజ్‌కుమార్, మందల సత్యనారాయణరెడ్డి, పురం ప్రేమ్చందర్, శ్రీనివాస్ గౌడ్, బాలాజీరావు, జావేద్, సాబిర్ ఖాన్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. టీ కప్పులో తుపాన్ సంబరాల సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బస్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభించగా.. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వర్గీయులు రంగంపల్లిలో భానుకు ఘనస్వగతం పలికారు. భానువెంట జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ రాజయ్య తదితరులు రెండో ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ వర్గం ర్యాలీ రంగంపల్లి మీదుగా కమాన్ చౌరస్తా నుంచి జెండా వరకు సాగింది. భాను వర్గంలో నగర కౌన్సిలర్లు, జూలపెల్లి, ఎలిగేడు మండల టీఆర్ఎస్ నాయకులు ఠాకూర్ రఘువీర్ సింగ్‌ల బృందం వెంట నడిచింది. ఎమ్మెల్యే ర్యాలీలో పెద్దపల్లి మండలం కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ఓదెల మండలాల నాయకులు ఉన్నారు. రెండు గ్రూపుల వ్యవహారం కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్లో సంభాషించుకున్న తర్వాత భానుప్రసాదరావు వెళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటికే భాను వెంట ర్యాలీలో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ర్యాలీలో చేరారు. -
ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మల్లన్నసాగర్ కు వెళ్తున్న నేతలను అరెస్టు చేయడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకరరెడ్డిలు అన్నారు. యూనివర్సిటీలకు వీసీల నియామకాలపై హైకోర్టు తీర్పు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సర్కారుకు చెంపపెట్టని విమర్శించారు. కేసీఆర్ అసమర్ధ పాలన వల్లే ఎంసెట్-2 పేపర్ లీకైందని, లీకుకు మేగ్నట్ ఇన్ఫోటెక్ కు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని దుయ్యబట్టారు. మేగ్నట్ ఇన్ఫోటెక్ కు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుకు సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు ఎంసెట్ లీకుకు బాధ్యులను చేస్తూ కేబినేట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని అన్నారు. మరోవైపు మెదక్ జిల్లా నుంచి మల్లన్నసాగర్ కు బయలుదేరిన లాయర్ల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద అడ్డుకున్న పోలీసులు ములుగు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా న్యాయవాదులు ఒంటిమిట్టలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కారు రాస్తారోకో చేస్తున్న లాయర్ల బృందం మీదుగా దూసుకుపోయింది. ప్రమాదంలో హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ కు గాయాలయ్యాయి. ఆగ్రహించిన న్యాయవాదులు పోలీసుల తీరును ఖండిస్తూ పీఎస్ ఎదుట ధర్నా చేశారు.