ఊరూరా తీర్మానిస్తే జిల్లా..
ఊరూరా తీర్మానిస్తే జిల్లా..
Published Tue, Aug 23 2016 9:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
పెద్దపల్లి: ఊరూరా సమావేశాలు నిర్వహించి కేసీఆర్ జిల్లాగా తీర్మానిస్తే పెద్దపల్లికి ఆ పేరు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో జిల్లా సంబరాలు ఘనంగా నిర్వహించారు. టపాసులు పేల్చడం, డిజే సౌండ్, తెలంగాణ పాటలు, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం తదితర కార్యక్రమాలతో టీఆర్‌ఎస్ శ్రేణులు హోరెత్తించాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అడగకుండానే జిల్లా ఇచ్చిన ముఖ్యమంత్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధికి పెద్ద పీటవేస్తుందన్నారు. సంబరాల్లో నగర పంచాయతీ చైర్మన్ ఎల్. రాజయ్య, నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, సారయ్య గౌడ్, లంక సదయ్య, పడాల తార, సందవేన సునీత, రేవతిరావు, కాంపెల్లి నారాయణ, మార్కు లక్ష్మణ్, ఎరుకల రమేష్, సతీష్ గౌడ్, రాజ్‌కుమార్, మందల సత్యనారాయణరెడ్డి, పురం ప్రేమ్‌చందర్, శ్రీనివాస్ గౌడ్, బాలాజీరావు, జావేద్, సాబిర్ ఖాన్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
టీ కప్పులో తుపాన్
సంబరాల సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బస్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభించగా.. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వర్గీయులు రంగంపల్లిలో భానుకు ఘనస్వగతం పలికారు. భానువెంట జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ రాజయ్య తదితరులు రెండో ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్సీ వర్గం ర్యాలీ రంగంపల్లి మీదుగా కమాన్ చౌరస్తా నుంచి జెండా వరకు సాగింది. భాను వర్గంలో నగర కౌన్సిలర్లు, జూలపెల్లి, ఎలిగేడు మండల టీఆర్‌ఎస్ నాయకులు ఠాకూర్ రఘువీర్ సింగ్‌ల బృందం వెంట నడిచింది. ఎమ్మెల్యే ర్యాలీలో పెద్దపల్లి మండలం కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ఓదెల మండలాల నాయకులు ఉన్నారు. రెండు గ్రూపుల వ్యవహారం కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఫోన్‌లో సంభాషించుకున్న తర్వాత భానుప్రసాదరావు వెళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటికే భాను వెంట ర్యాలీలో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి ర్యాలీలో చేరారు.
Advertisement
Advertisement