MLC kolagatla virabhadrasvami
-
పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో వణుకు
ప్రజాసంకల్పయాత్ర నుంచి.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబు సర్కారుకు దడ పుడుతోందని విజయనగరానికి చెందిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తెలుగుదేశం నేతలకు నోటిమాట రావడం లేదన్నారు. జగన్ పాదయాత్రకు ప్రారంభంలో ఏ విధంగా స్పందన ఉందో పది జిల్లాలు పూర్తిచేసుకుని పదకొండో జిల్లాలోకి అడుగు పెడుతున్న సందర్భంలోనూ అదే స్పందన లభిస్తుండడం విశేషమన్నారు. మంగళవారం ఆయన ఆనందపురం మండలం ముచ్చెర్ల వద్ద పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబును ఎప్పుడు గద్దెదించుదామా అన్న ఆతృతలో రాష్ట్రప్రజానీకం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. ఈనెల 23న విజయగనరం జిల్లా చింతలవలసలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఆదేరోజు కొత్తవలసలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఘనంగా ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
రాజుగారూ.. రాజీనామా చేయండి
బొబ్బిలి: వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్‌కృష్ణ చిత్తశుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజా గౌరవం పొందాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ చేశారు. బొబ్బిలిలో తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో అప్పయ్యపేట రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక వైఎస్సార్ సీపీలో బొబ్బిలి రాజులు చేరారు తప్ప... పార్టీని వారు తీసుకురాలేదని పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీద్వారా దక్కిన పదవిని విడచిపెట్టాల్సిందేనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజులు పార్టీ వీడినా పార్టీ మాత్రం చెక్కుచెదరలేదనీ, దాని బలం తగ్గలేదని స్పష్టం చేశారు. రాజులకు ఒకప్పుడు గౌరవం ఉండేదనీ, ఇప్పుడు అది పోయిందని పేర్కొన్నారు. సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు నీతికి మారుపేరు సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణిలు నీతి, నిజాయితీకి మారుపేరని కొనియాడా రు. వారిద్దరి ఆధ్వర్యంలో బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మ రింత అభివృద్ధి చెందుతుందన్నారు. బొబ్బిలి నాయకు లు, కార్యకర్తలకు జిల్లా పార్టీ అండగా ఉంటుందనీ, త్వరలో పట్టణంలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ తెలిపారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స మాట్లాడుతూ పార్టీకి ప్రజలుంటే చాలని, నాయకులు అక్కరలేదన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రజాభి మానం ఉందన్నారు. మహారాజుల కాలం పోయిందని, అశోక్ లాంటి వారినే విజయనగరంలో ఓడించి కోలగట్లకు పట్టం కట్టడాన్ని మరచిపోకూడదన్నారు. నేతల్లేకపోయినా కార్యకర్తల అండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ తాము లేకపోతే బొబ్బిలిలో పార్టీయే లేద ని రాజులు భ్రమలు కలిగించారని, కానీ పార్టీ వెంట ఉన్నామని కార్యకర్తలు నిరూపించారన్నారు. జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి పార్టీని వీడిన వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెర్లాం పార్టీ నాయకుడు మర్రాపు జగన్నాథం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని బొబ్బిలిలో ముందుకు నడిపిస్తామన్నారు. రాజన్న సేవా సమితి వ్యవస్థాపకుడు తూముల రాంసుధీర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమ లు చేయలేదన్నారు. కార్యక్రమంలో విజయనగరానికి చెందిన సుంకరి బాబు, లెంక సత్యం, వినోద్ కుమార్ దుబే, ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగరాజు, స్థానిక నాయకులు చంద్రంపూడి రమేష్, బొమ్మి అప్పలనాయుడు, కోల బాలాజీ తిరుపతిరావు, బర్ల వెంకటరమణ యాదవ్, పట్నాన శంకరరావు, వై.సి.హెచ్.జి.రంగారావు, గర్బాపు దాలయ్య, చోడిగంజి రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబుపై 8న ఫిర్యాదులు
విజయనగరం మున్సిపాలిటీ: అధికారంకోసం ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి తీరా సీఎం అయిన తరువాత వాటిని నెరవేర్చకుండా దగా చేసినందుకు చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగునాగార్జున తెలిపారు. ఈ మేరకు శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాల అమలులో విఫలం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడంపై అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల ఎనిమిదో తేదీన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు చేయనున్నట్టు తెలిపారు. పాలనలో వైఫల్యాలవల్ల ఇక భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే అవినీతిసొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నారనీ, అయితే ఇంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన చంద్రబాబేమీ ప్రధానమంత్రి అయిపోరనీ, వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా పోదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు బాబు పాల నను గమనిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిం చారు. ఎన్నికలకు ముందు తానెం తో అనుభవశాలిని అంటూ ప్రజలను ప్రలోభపెట్టి, రెండేళ్ల పాలనలో ఏమీ సాధించలేదని, ఇప్పుడు బాధ్యాతారాహిత్యంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క హమీని అమలుచేయలేదనీ, పరిపాలన గాలికొదిలేశారని తూర్పారబట్టారు. కేవలం తన కుటుంబ ప్రయోజనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్వప్రయోజనాలకే బాబు ప్రాధాన్యమిస్తున్నారని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. ఇలా చంద్రబాబు చేస్తున్న ప్రజాద్రోహానికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం కోసం, రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు. సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బొద్దాన అప్పారావు, యువజన విభాగం నాయకులు జి.వి.రంగారావు, ఎస్.బంగారునాయుడు, అల్లు చాణక్య, మాజీ కౌన్సిలర్లు పట్నాన పైడిరాజు, లీగల్‌సెల్ నాయకులు ద్వారపురెడ్డి స్వరూప్, రెడ్డి గురుమూర్తి, మార్రోజు శ్రీను, గండ్రేటి. సన్యాసిరావు, మండల పార్టీ నాయకులు భోగి రమణ, సత్తిరాజు, లెంకజగ్గునాయుడు, పండు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రానికి చంద్రబాబు దాసోహం
నిధులు రాబట్టుకోవడంపై ఎందుకు నోరువిప్పడం లేదు? ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రజలను బలి చేస్తారా? పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్ వినియోగంపై సడలింపునివ్వాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం మున్సిపాలిటీ : తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి దాసోహమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల.వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఓవైపు రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టితో రూ.వేలకోట్లలో నష్టం వాటిల్లితే కేంద్ర నుంచి తక్షణ సాయాన్ని పొందలేకపోవడం దారుణమన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్య పార్టీగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు లొంగిపాయి రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల్లా తమిళనాడు రాష్ట్రంలో కురిస్తే అక్కడి ప్రభుత్వం కేంద్రం నుంచి తక్షణ సాయం కింద రూ.939 కోట్ల నిధులను మంజూరు చేయించుకుందన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు రాబట్టుకోలేకపోయారన్నారు. ఇస్తామన్నా సాధించలేకపోయారు గత ఏడాది సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని స్వయానా కేంద్రం ప్రకటిస్తే అందులో సగం కూడా సాధించలేకపోయారన్నారు. ఇందుకు చంద్రబాబు లొసుగులే కారణమని ఫలితంగా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సందర్బంలో అక్కడ ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ ఏడాది అది చేస్తా.. ఇది చేస్తా.. నెల్లూరును మార్చేస్తా అని గొప్పలకు పోయే ప్రకటనలు చేయడాన్ని ఖండించారు. సహాయక చర్యలు సిగ్గుసిగ్గు ఇదే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి పర్యటించిన సందర్బంలో అక్కడి ప్రజల ఆవేదన చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అర్థమవుతున్నాయంటూ పెదవి విరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనను సడలించాలని కోరారు. ఈ విషయంపై ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.